Rashmi Goutham: హీరో ఎవరైనా.. రెమ్యూనరేషన్ విషయంలో తగ్గేదేలే

Rashmi Goutham: రష్మీ గౌతమ్.. బుల్లితెర టాప్ యాంకర్స్ లలో ఒకరు. సపోర్టింగ్ పాత్రలు చేస్తూ వెండితెర పైన, బుల్లి తెరపైన సందడి చేస్తూ ప్రేక్షకులకి పరిచయం అయ్యింది రష్మీ. అయితే ఈటీవీ లో ప్రసారమైన కామెడీ షో “జబర్దస్త్” ద్వారా పాపులారిటీ ని సంపాదించుకుంది ఈ ముద్దుగుమ్మ. ఒకవైపు జబర్దస్త్ తో పాటు ఢీ షో లలో కూడా మెరుస్తుంది. ఇంక మధ్య మధ్య లో వెండి తెరపైన అడపా దడపా సినిమాలు చేస్తూ సందడి చేస్తుంది. అయితే ఈ భామ కి ఏకంగా మెగాస్టార్ సినిమాలో స్పెషల్ సాంగ్ చేసే అవకాశం వచ్చిందని టాలీవుడ్ లో టాక్.

మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్న మెగాస్టార్ సినిమా “భోళా శంకర్”. ఈ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ లో రష్మీ గౌతమ్ చిరు సరసన స్టెప్పులు వేయినుందంట. అయితే ఇదే పెద్ద సెన్సేషన్ టాపిక్ అనుకుంటే ఐటెం సాంగ్ కోసం రష్మీ తీసుకునే పారితోషికం కూడా హాట్ టాపిక్ గా మారింది. ఎంత పెద్ద స్టార్ హీరో అయినా రెమ్యూనరేషన్ విషయం లో తగ్గేదేలే అంటుందంట రష్మీ గౌతమ్.

ఈ ఒక్క పాట కోసం రష్మీ 40 లక్షల వరకు డిమాండ్ చేసిందని టాక్. అయితే సినీ నిర్మాతలు ఒకే చెప్పినట్లు తెలుస్తుంది. ఈ స్పెషల్ సాంగ్ కి శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ చేయనున్నారట. ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఈ స్పెషల్ సాంగ్ కి రష్మీ ని రిఫర్ చేసింది శేఖర్ మాస్టర్ అంట. కాగా ఈ సినిమాకి చిరంజీవి సరసన తమన్నా హీరోయిన్ గా నటిస్తుండగా.. కీర్తి సురేష్ ఓ కీలక పాత్రలో నటిస్తుంది.