ఇపుడు సోషల్ మీడియాలో రష్మీ రచ్చ..!

Rashmi-Gautam-Age-Husband-Net-Worth-Movies-Serial-Biography

తెలుగు బుల్లితెర దగ్గర మంచి ఫేమస్ అయ్యిన యాంకర్ కం యాక్ట్రెస్ లలో రష్మీ గౌతమ్ కూడా ఒకామె. అయితే రష్మీతో పాటుగా తన కో సీనియర్ యాంకర్ అనసూయ భరద్వాజ్ అయితే సోషల్ మీడియాలో అప్పుడపుడు వచ్చి ఏదొక అంశంపై అలా కెలికేసి వెళ్ళిపోతుంది. లేదా కొన్ని రోజులు పాటు ఆ రచ్చ కొనసాగుతుంది.

అయితే అనసూయ విషయం పక్కన పెడితే లేటెస్ట్ గా గత కొన్ని రోజులు రష్మీ గౌతమ్ కంటిన్యూ చేస్తుంది. అయితే అనసూయలా రష్మీ పోస్ట్ లు కానీ రిప్లై లు కానీ ఎవరినీ ట్రిగ్గర్ చేసినట్టు ఉండవు. కానీ కొంతమంది ఓవర్ యాక్ట్ చేసే నెటిజన్స్ కి రష్మీ పర్ఫెక్ట్ సమాధానం ఇస్తుంది.

మరి రష్మీ అయితే తన మతం కోసం కానీ దేశంలో కులాలు, పెంపుడు జంతువులు విషయంలో చాలా క్లారిటీగా ఉంటుంది. అలాగే ఈ కొన్ని రోజులు కితం వరకు ఇదే రచ్చలో ఉన్న రష్మీ లేటెస్ట్ గా ఓ నెటిజన్ కి ఘాటు రిప్లై అయితే ఇచ్చింది. రష్మీ ఇండియాలో ఎక్కువ వెజిటేరియన్స్ ఉంటారని పోస్ట్ చేయగా.

దానికి ఓ నెటిజన్ అయితే మీ హిందువులు మాంసం వండుతున్నారు అన్నట్టుగా పోస్ట్ చేసాడు. దీనితో రష్మీ నువ్వు క్రిస్టియన్ అనుకుంటున్నాను నిజమేనా ఇదొక క్లారిటీ కావాలి అని అతన్ని అడగగా, ఇంట్రెస్టింగ్ గా అతను అవును నేను క్రిస్టియన్ నే నీకేమన్నా ప్రాబ్లమా అని రష్మీని అడగ్గా దానికి ఆమె స్ట్రాంగ్ రిప్లై ఇచ్చింది.

నాకు ఎలాంటి సమస్య లేదు కానీ నువ్ క్రిస్టియన్ అయ్యినప్పుడు ఇంకా ఎందుకు హిందూ పేరునే ఉంచుకున్నావు? అందుకే కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాను. గతంలో చాలా మంది కూడా నీలానే హిందూ పేర్లు ఉంచుకొని హిందువులనే కించపరుస్తున్నారు అని స్ట్రాంగ్ రిప్లై ఇచ్చింది.