సుడిగాలి సుధీర్, రష్మీ గౌతమ్ బుల్లితెరపై చేసే రచ్చ అంతా ఇంతా కాదు. తమ మధ్య ఏమీ లేదని చెప్పినా సరే ప్రేక్షకులు మాత్రం వారి కెమిస్ట్రీకి ఫిదా అవుతుంటారు. గత ఏడేళ్లుగా రష్మీ సుధీర్ అంటూ ప్రేక్షకుల్లో ఓ ముద్ర పడింది. ఈ ఇద్దరిని జంటగా చూసేందుకు అభిమానులు ఆత్రుతగా ఎదురుచూస్తుంటారు. కొన్ని సందర్భాల్లో అయితే వారి అభిమానులు నేరుగా అడిగేస్తుంటారు. సుధీర్‌ను పెళ్లి చేసుకో, రష్మిని పెళ్లి చేసుకో అని రష్మీ, సుధీర్‌లకు అభిమానులు కామెంట్లు పెడుతుంటారు.
కొన్ని సార్లు అలాంటి కామెంట్లను లైట్ తీసుకుంటారు. ఇంకొన్ని సందర్భాల్లో రష్మీ మాత్రం ఫైర్ అవుతూ ఉంటుంది. సోషల్ మీడియాలో ఈ ఇద్దరి వ్యవహారం ఎలా ఉన్నా కూడా బుల్లితెరపై ఇప్పటికి కెమిస్ట్రీ హైలెట్ అవుతూనే ఉంటుంది. తాజాగా వచ్చిన ఎక్స్ ట్రా జబర్దస్త్ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఎందుకంటే అందులో సుధీర్, గెటప్ శ్రీను , రాం ప్రసాద్ వేసిన స్కిట్ కొత్తగా ఉండటంతో అందరూ తెగ షేర్లు చేసేస్తున్నారు.
ఆ స్కిట్‌లో సుధీర్‌కు గర్భం వస్తుందట. సుధీర్ నెల తప్పడంతో సీమంతం కూడా చేసేస్తారు.స్టేజ్ మీదే సుధీర్‌ను కూర్చోబెట్టి పసుపు కుంకుమ రాసేస్తుంటారు. ఆ సీమంతం వేడుకల్లో రష్మీ కూడా పాల్గొంటుంది. కానుకలుకూడా తెస్తుంది. అసలు ఎలా నెల తప్పావ్ అంటూ సీక్రెట్‌గా అడుగుతుంది. దీంతో అందరూ నవ్వేస్తారు. చివరకు ఓ పండును చూపిస్తు.. పండంటి బిడ్డను కను అని తన మనసులోని మాటను చెప్పేసింది. మొత్తానికి ఇలా ఈ ఇద్దరూ కలిసి పండించిన కెమిస్ట్రీకి ప్రోమో బాగానే క్లిక్ అయింది.