బుల్లితెరపై అనసూయ, రష్మీల మధ్య ఉండే కోల్డ్ వార్ గురించి అందరికీ తెలిసిందే. జబర్దస్త్ షోను మొదటి నుంచి తన భుజాల మీద మోసింది అనసూయ. మధ్యలో పెళ్లి, గర్భం దాల్చడంతో జబర్దస్త్‌ను వీడాల్సి వచ్చింది. ఆ సమయంలో రష్మీ ఎంట్రీ ఇచ్చింది. తెలుగులో తడబడుతూనే మెల్లిగా యాంకరింగ్ మొదలెట్టింది. మొదట్లో చాలా ఇబ్బంది పడ్డా.. ఇప్పుడు మాత్రం ఓ రేంజ్‌లో హల్చల్ చేస్తోంది. అయితే అనసూయ మళ్లీ వస్తాను అనడం, అప్పటికే ఆర్టిస్ట్‌లు కూడా ఎక్కువ అయిపోవడంతో రెండు షోలుగా విడగొట్టారు.
Rashmi Gautam Calls Anasuya Husband Susank Bhardwaj
అలా రష్మీకి, అనసూయకు మధ్య జబర్దస్త్, ఎక్స్ ట్రా జబర్దస్త్ అనే పోటీ ఉంటుంది. ఆ మధ్య టీం లీడర్లు తమ స్కిట్స్‌లో వీరిపై సెటైర్లు ఓ రేంజ్‌లో వేసేశారు. వీరి స్నేహం అంతా నటన అని కెమెరా ముందు మాత్రమే అలా నవ్వుకుంటారని అసలు కథ వేరే ఉంటుందని సెటైర్లు వేసేవారు.కానీ వీరిద్దరూ ఆఫ్ స్క్రీన్ కూడా ఎంతో అన్యోన్యంగా ఉంటారు. అనసూయ ఫ్యామిలితో రష్మీ ఎంతో బాగా కలిసిపోయింది.
అనసూయ భర్త సుశాంక్ భరద్వాజ్‌ను రష్మీ ఏమని సంభోదిస్తుందో ఎవ్వరికీ తెలియదు. నేడు సుశాంక్ బర్త్ డే. ఈ మేరకు భర్తపై ప్రేమను చాటుతూ.. విషెస్ తెలిపింది. అయితే రష్మీ కూడా సుశాంక్‌కు విషెస్ చెప్పింది. ప్రేమగా భాయ్ సాబ్ అంటూ సంబోధించింది. ఈ లెక్కన అనసూయ వదిన అవుతుందన్న మాట. మొత్తానికి రష్మీ అనసూయ స్నేహానికి ఇదొక నిదర్శనం.