ప్రభాస్ సినిమాలో పాత్ర చిన్నదైనా రాశీ ఖన్నా ఓకే చేయటానికి కారణం పెద్దదే!

Rashi khanna finalised in nag aswin- prabhas movie

‘ఊహలు గుసగుసలాడే’ మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన రాశీ ఖన్నా… మొదటి సినిమాతోనే తెలుగు ఆడియన్స్ మనసు దోచుకుంది. ఆ తర్వాత వరుసగా చాలా సినిమాలే చేసినప్పటికీ అవన్నీ మీడియం రేంజ్ హీరోల చిత్రాలే. మొదట్లో చబ్బీ లుక్స్ తో ముద్దుగా కనిపించి తర్వాత సన్నబడి సెక్సీ లుక్స్ తో పిచ్చెక్కిస్తుంది. అమ్మడి అభినయానికి,అందానికి ఎప్పుడో స్టార్ లీగ్ లోకి వెళుతుందనుకున్నా ఎందుకో గాని అలా జరగలేదు. ఫైనల్ గా ఇప్పుడు ఈ భామకి ఆ టైం వచ్చినట్లుగా కమనిపిస్తుంది.

బాహుబలి సినిమా తర్వాత ‘ప్రభాస్’ చేసే సినిమాలన్నీ పాన్ ఇండియా లెవెల్ లోనే రూపొందుతున్నాయి. ప్రస్తుతం ప్రభాస్ సలార్, ఆదిపురుష్ సినిమాల షూటింగ్ లో బిజీ గా ఉన్నాడు. వీటి తర్వాత దర్శకుడు నాగ్ అశ్విన్ రూపొందించే సైన్స్ ఫిక్షన్ మూవీ సెట్స్ పైకి వెళ్లనుంది. భారీ బడ్జెట్ తో వైజయంతి మూవీస్ బ్యానర్ మీద నిర్మాత అశ్వినిదత్ ఈ ప్రాజెక్టును పాన్ ఇండియా మూవీగా నిర్మిస్తారట. ఈ మూవీలో హీరోయిన్ గా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణే ఎంపికైంది. ఇందులో మరికొన్ని కీలకమైన పాత్రల కోసం ప్రముఖ నటీ నటులను ఎన్నుకుంటున్నారు నాగ్ అశ్విన్.

ఆల్రెడీ బిగ్ బి అమితాబ్ ఈ మూవీలో భాగస్వామి కాగా తాజాగా మరో కీలక పాత్ర కోసం రాశీ ఖన్నాను తీసుకున్నారని సమాచారం. పాత్ర నిడివి తక్కువైనప్పటికీ కథలో కీలకమైన పాత్ర మరియు క్రేజీ ప్రాజెక్ట్ కావటంతో వెంటనే ఓకే చేసిందట. ప్రస్తుతం నాగ చైతన్య ‘థాంక్యూ’, గోపీచంద్ ‘పక్కా కమర్షియల్’ సినిమాలతో పాటు తమిళంలో మూడు ప్రాజెక్ట్స్‌ చేస్తున్నారు. ఇవేకాక రాజ్& డీకే దర్శకత్వంలో రూపొందే ఓ వెబ్ సీరీస్ లో షాహిద్ కపూర్‌ సరసన, అజయ్ దేవగణ్ నటించే మరో వెబ్ సీరీస్ లో కూడా నాయికగా చేస్తుంది. చూస్తుంటే త్వరలో రాశీ ఖన్నా రేంజ్ చేంజ్ అవబోతున్నట్లుగా అర్ధమవుతుంది.