నా కంఫర్ట్ జోన్ దాటి ఆ పాత్రలో నటించాను.. మొదట్లో చాలా భయం వేసింది: రాశిఖన్నా

రాశిఖన్నా ఊహలు గుసగుసలాడే అనే సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈమె అనంతరం పలు సినిమా అవకాశాలను అందుకొని ఇండస్ట్రీలో ఎంతో బిజీగా గడుపుతున్నారు.ఈమె కేవలం తెలుగు సినిమాలలో మాత్రమే కాకుండా తమిళం హిందీ భాషలలో కూడా వరుస సినిమాలు వెబ్ సిరీస్ లలో నటిస్తూ బిజీగా ఉన్నారు. ఇకపోతే తాజాగా ఈమె హిందీలో రుద్ర అనే వెబ్ సిరీస్ లో నటించిన సంగతి మనకు తెలిసిందే. ఈ వెబ్ సిరీస్ లో భాగంగా రాశి ఖన్నా నెగిటివ్ పాత్రలో నటించారు.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈమె ఈ వెబ్ సిరీస్ గురించి పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.తనకి సౌత్ ఇండియాలో నటిగా ఎంతో మంచి గుర్తింపు పొందడమే కాకుండా తనపై ఒక పాజిటివ్ ఒపీనియన్ ఉంది.ఈ క్రమంలోనే తాను రుద్ర అనే వెబ్ సిరీస్ ద్వారా నెగిటివ్ పాత్రలో నటించడానికి కాస్త భయపడ్డానని ఈ పాత్రలో పూర్తిగా నా కంఫర్ట్ జోన్ దాటి నటించానని రాశిఖన్నా వెల్లడించారు. ఇకపోతే ప్రేక్షకులు బాగా ఆదరించారని ఈమె చెప్పుకొచ్చారు.

ఇలా ప్రేక్షకుల నుంచి ఒక నటికి ఈ విధమైనటువంటి సపోర్ట్ కనుక ఉంటే ఎలాంటి పాత్రలలోనైనా నటించడానికి సిద్ధంగా ఉంటారని ఈమె వెల్లడించారు. ఇకపోతే ఈ వెబ్ సిరీస్ తో పాటు తమిళంలో కూడా కొన్ని సినిమాల్లో నటిస్తున్నారు.ఇదిలా ఉండగా తాజాగా ఈమె మారుతి దర్శకత్వంలో గోపీచంద్ సరసన పక్క కమర్షియల్ అనే సినిమాలో నటించి ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అదేవిధంగా త్వరలోనే నాగచైతన్య సరసన నటించిన థాంక్యూ సినిమా ద్వారా మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.