Jersy Movie : ముంబై లో మన దర్శకుడికి దక్కిన అరుదైన గౌరవం..!

Jersy Movie : గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో వచ్చిన సినిమా ఎంతటి ప్రజాదరణ పొందిందో అందరికీ తెలిసిందే. నాని హీరోగా వచ్చిన ఈ సినిమా జాతీయ పురస్కారాన్ని కూడా అందుకుంది. నాని కెరీర్లో ఈ సినిమా ఒక మైలురాయి గా నిలిచింది. ఈ జెర్సీ సినిమాని అదే టైటిల్ తో షాహిద్ కపూర్ హిందీలో రీమేక్ చేశారు. హిందీలో కూడా ఈ సినిమాకు గౌతమ్ తిన్ననూరి నే దర్శకత్వం వహించారు.

కరోనా మరియు ఇతర కారణాల వలన హిందీ రీమిక్స్ డిజె సినిమా వాయిదా పడుతూ వచ్చి ఎట్టకేలకు విడుదల అయింది. బాలీవుడ్ లో కూడా ఫీల్ గుడ్ మూవీగా డీసెంట్ టాక్ తెచ్చుకుని థియేటర్ లలో రన్ అవుతోంది. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా బాలీవుడ్ లో కూడా దర్శకుడిగా మంచి పేరు తెచ్చిపెట్టింది. బాలీవుడ్ ప్రేక్షకుల నుంచి దర్శకుడికి అభినందనలు వెల్లువలా వస్తున్నాయి.

సినిమా విడుదలైన తర్వాత ముంబైలోని ఒక థియేటర్లో జెర్సీ సినిమా చూడడానికి వెళ్లిన దర్శకుడు గౌతమ్ తిన్ననూరి కి థియేటర్ లోని ప్రేక్షకులు స్టాండింగ్ ఓవేషన్ లో అభినందనలు తెలిపారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్ లో వైరల్ గా మారింది. అయితే ఈ వీడియోని షాహిద్ కపూర్ తన అధికారిక ఖాతా లో పోస్ట్ చేస్తూ దర్శకుడు గౌతమ్ తిన్ననూరి ని పొగడ్తలతో ముంచెత్తాడు.స్టాండింగ్ ఒవేషన్ గౌరవానికి గౌతమ్ పూర్తిగా అర్హుడు, తన పట్ల ఎంతో గర్వంగా ఉంది… అంటూ ట్వీట్ లో పేర్కొన్నాడు.