లగ్జరీ అపార్ట్మెంట్ ని కోనుగోలు చేసిన రణవీర్, దీపికా ఖరీదు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే?

బాలీవుడ్ ఫేమస్ సెలబ్రిటీ కపుల్స్ లో రణబీర్ సింగ్, దీపికా పదుకొనే జంట ఒకటి. 2018 లో వీరిద్దరూ వివాహబంధంతో ఒక్కటయ్యారు. అప్పటినుండి వీరిద్దరూ ఏంతో అన్యోన్యంగా ఉంటూ బెస్ట్ కపుల్ గా గుర్తింపు పొందారు. వివాహం తర్వాత కూడా దీపిక సినిమాలలో నటిస్తోంది. ఇక రణవీర్ సింగ్ కూడా ప్రస్తుతం సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఇదిలా ఉండగా ఈ జంట తాజాగా ఒక ఖరీదైన ఇంటిని కొనుగోలు చేశారు. ముంబైలోని బాంద్రాలో ఒక లక్సరీ క్వాడ్రపుల్స్ ఆపార్ట్‏మెంట్‏ను కొనుగోలు చేసినట్లు బాలీవుడ్ మీడియా వెల్లడించింది. పెళ్లి పెళ్లయిన కొత్తలోనే ఈ జంట ఓ ఇంటిని 22 కోట్లు ఖర్చు చేసి ఒక బంగ్లాని ఈ కొనుగోలు చేసింది.

బాలీవుడ్ వర్గాల సమాచారం ప్రకారం.. రణవీర్ సింగ్ తన తండ్రి జుగ్జీత్ సుందర్‌సింగ్ భవ్నానీ సొంత సంస్థ ఓహ్ ఫైవ్ ఓహ్ మీడియా వర్స్క్ ఎల్ఎల్పీతో కలిసిఈ ఇంటిని కొనుగోలు చేశాడు. ముంబైలోని బాంద్రాలో ఈ అపార్ట్మెంట్ ఉంది. అపార్ట్మెంట్ కోసం రణవీర్ సింగ్ దంపతులు ఏకంగా రూ. 119 కోట్లు ఖర్చు చేశారు. ఈ బాంద్రా ఏరియాలో బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ సహా పలువురు ఫేమస్ బాలీవుడ్ సెలబ్రెటీల ఇల్లు కూడా ఉన్నాయి. ఈ ప్లాట్ ప్రత్యేకత ఏమిటంటే ఈ ఫ్లాట్ నుంచి చూస్తే ఒక వైపు సముద్రం కూడా కనిపిస్తుందట.

రణవీర్ సింగ్ దంపతులు కొనుగోలు చేసిన ఫ్లాట్ క్వాడ్రప్లెక్స్. అంటే ఒకే ఫ్లాట్ నాలుగు అంతస్తులుగా ఉంటుంది. వీరు కొనుగోలు చేసిన అపార్ట్మెంట్ లో 16, 17, 18, 19 అంతస్తులు ఉన్నాయి. ఈ అపార్ట్మెంట్ మొత్తం 11,266 చదరపు అడుగుల కార్పెట్ ఏరియా కాగా.. 1,300 చదరపు అడుగుల ప్రత్యేకమైన టెర్రస్ కూడా ఈ అపార్ట్మెంట్ కి ఉందట. బాంద్రాలోని ఖరీదైన బంగ్లాలో అత్యంత ఖరీదైన అపార్ట్మెంట్ ని ఈ దంపతులు సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం రణవీర్ సిర్కస్, రాకీ ఔర్ రాణికి ప్రేమ్ కహానీ చిత్రాల్లో నటిస్తున్నారు. ఇక దీపికా పదుకొనే కూడా ప్రభాస్ తో కలిసి ప్రాజెక్ట్ కే సినిమాతో పాటు మరో రెండు సినిమాలలో నటిస్తోంది. ఇటీవల కాఫీ విత్ కరణ్ షోలో పాల్గొన్న రణవీర్ సింగ్ వాళ్ళ ఆసక్తికర విషయాలను వెల్లడించాడు.