మొత్తానికి నితిన్ ఫిక్స్ అయ్యాడు.. మార్చ్‌లో రంగే దే చిత్రాన్ని దింపుతున్నాడు

క‌రోనా వ‌ల‌న లాక్‌డౌన్ ప్ర‌క‌టించ‌డంతో దాదాపు తొమ్మిది నెల‌లు థియేట‌ర్స్ మూత‌ప‌డ్డాయి. దీంతో ఏం చేయాలో పాలుపోక నిర్మాత‌లు ఓటీటీలో కొన్ని సినిమాల‌ని విడుద‌ల చేశారు. ఇందులో కొన్ని హిట్ అయ్యాయి, కొన్ని ఫ‌ట్ అయ్యాయి. ఫ్లాప్ అయిన సినిమాలు న‌ష్ట‌పోయిన‌ట్టు దాఖ‌లాలు లేవు. అయితే త‌మ సినిమాల‌ని థియేట‌ర్స్‌లోనే విడుద‌ల చేయాల‌ని భావించిన కొంద‌రు స్టార్స్ ఇప్పుడు ఒక్కొక్క సినిమా రిలీజ్ డేట్స్ ఫ్ర‌క‌టిస్తూ ఫ్యాన్స్ లో ఆనందాన్ని నింపుతున్నారు.

సంక్రాంతి బరిలో నిలిచే సినిమాలు ఇప్ప‌టికే ఫిక్స్ కాగా తాజాగా యంగ్ హీరో న‌టించిన చిత్రం రంగ్ దే రిలీజ్ డేట్ ఫిక్స్ అయింది. రొమాంటిక్‌ లవ్‌ స్టోరిగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు వెంకీ అట్లూరి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తుండగా.. కీర్తి సురేష్ హీరోయిన్‌గా న‌టిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్నారు. సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై సూర్య‌దేవ‌ర నాగ‌వంశీ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని మార్చి 26న థియేట‌ర్స్‌లో విడుద‌ల చేయ‌నున్న‌ట్టు వీడియో ద్వారా తెలియ‌జేశారు మేక‌ర్స్

రీసెంట్‌గా రంగ్ దే చిత్ర షూటింగ్ పూర్తి కాగా, ఇందులో న‌రేష్‌, వినీత్‌, రోహిణి, వెన్నెల కిషోర్‌, గాయ‌త్రి ర‌ఘురామ్ కీల‌క పాత్ర‌ల్లో కనిపించనున్నారు. సినిమా రిలీజ్ ద‌గ్గ‌ర ప‌డుతుండ‌డంతో మేక‌ర్స్ సినిమా నుండి ఒక్కో అప్‌డేట్ ఇచ్చుకుంటూ వస్తున్నారు. ఆ మ‌ధ్య `ఏమిటో ఇది వివ‌రించ‌లేనిది.. మ‌ది ఆగ‌మ‌న్న‌ది త‌నువాగ‌న‌న్న‌ది…` అంటూ సాగే ఈ పాట‌ని విడుద‌ల చేయ‌గా, దీనికి మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. సినిమా మంచి విజ‌యం సాధిస్తుంద‌నే న‌మ్మ‌కంతో మేక‌ర్స్ ఉన్నారు