కవల పిల్లలకు జన్మనివ్వబోతున్న స్టార్ హీరోయిన్ !

రణబీర్ కపూర్ అలియా జంట గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వీరిద్దరూ ఐదు సంవత్సరాల నుంచి ప్రేమలో ఉండి ఈ ఏడాది ఏప్రిల్ నెలలో వివాహం చేసుకున్నారు. ఇకపోతే వీరి వివాహం జరిగిన మూడు నెలలకే అలియా భట్ తల్లి కాబోతున్నారని వార్త తెలియజేశారు.ఇక ఈమె తల్లి కానున్నరనే తెలియడంతో ఈమె కమిట్ అయిన సినిమాలను శరవేగంగా షూటింగ్ పనులు పూర్తి చేసుకుంటున్నారు. మరోవైపు రణబీర్ కపూర్ సైతం తాను నటించిన సినిమాలన్నీ విడుదలకు సిద్ధమవుతుండగా పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలు చేస్తున్నారు.

ఈ క్రమంలోనే ఈయన నటించిన షెంషేరా ఈ నెల 22 వ తేదీ విడుదల కావడంతో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రణబీర్ కపూర్ కి యాంకర్ ఓ ప్రశ్న వేశారు. ఇప్పుడు మీరు మూడు స్టేట్మెంట్స్ ఇవ్వాలి.అందులో రెండు నిజం అవ్వాలి మరొకటి అబద్ధం అయి ఉండాలని అడిగారు. ఆ మూడు స్టేట్మెంట్లు చెప్పండి అని యాంకర్ ప్రశ్నించగా.. రణబీర్ కపూర్ ఆసక్తికరమైన స్టేట్మెంట్స్ ఇచ్చారు.

ఇందులో మొదటిది త్వరలోనే భారీ బడ్జెట్ సినిమా చేయబోతున్నానని చెప్పారు. ఇక రెండవ స్టేట్మెంట్ తాను త్వరలోనే సినిమాలకు గుడ్ బై చెప్పబోతున్నట్లు తెలిపారు. చివరి స్టేట్మెంట్ గా అలియా కవలలకు జన్మనివ్వబోతుందని తెలిపారు. అయితే ఇందులో మొదటి స్టేట్మెంట్ నిజమని యాంకర్ తెలిపారు.ఈయన త్వరలోనే భారీ బడ్జెట్ సినిమా చేయనున్నారని గత కొద్ది రోజుల నుంచి వార్తలు వస్తున్నాయి. ఇక సినిమాలకు గుడ్ బై చెబుతారని విషయం పూర్తిగా అబద్ధం.ఇకపోతే అలియా కవలలకు జన్మనివ్వబోతున్నారనే విషయం కూడా నిజం కావచ్చు. ఈ విధంగా ఈయన తనకు తెలియకుండానే ఆలియా కవలలకు జన్మనివ్వబోతున్నారని తెలియజేశారు. ప్రస్తుతం ఈ వార్త వైరల్ అవుతుంది.