రణబీర్ బ్రహ్మాస్త్ర రన్ టైం లాక్.. సినిమా నిడివి ఎంత అంటే?

బాలీవుడ్ సెలబ్రిటీస్ రణబీర్ కపూర్, అలియా భట్ జంటగా టాలెంటెడ్ డైరెక్టర్ అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన చిత్రం బ్రహ్మాస్త్ర. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో సెప్టెంబర్ తొమ్మిదవ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇక ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానున్న నేపథ్యంలో దక్షిణాది రాష్ట్రాలలో కూడా పెద్ద ఎత్తున ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇకపోతే ఈ సినిమాని తెలుగులో స్వయంగా ఎస్ఎస్ రాజమౌళి సమర్పణలో విడుదల కానున్న నేపథ్యంలో రాజమౌళి దగ్గరుండి సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో పాల్గొంటున్నారు.

ఇక ఈ సినిమా ఫ్రీ రిలీజ్ వేడుకను రామోజీ ఫిలిం సిటీ లో ఎంతో గ్రాండ్ గా నిర్వహించాలని ప్లాన్ చేసినప్పటికీ గణేష్ ఉత్సవాల నిమిత్తం ఈ వేడుక రద్దు అయింది. తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్నటువంటి పలు కార్యక్రమాలలో బ్రహ్మాస్త్ర చిత్ర బృందం పాల్గొని పెద్ద ఎత్తున తమ సినిమాను ప్రమోట్ చేస్తున్నారు. ఇక ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడటంతో సినిమా సెన్సార్ కార్యక్రమాలను కూడా పూర్తి చేసుకున్నట్టు తెలుస్తుంది.

ఇక ఈ సినిమా రెండు గంటల 47 నిమిషాల రన్ టైం ఉందని తెలుస్తోంది. కథ నిమిత్తం ఈ సినిమా నిడివి కాస్త ఎక్కువగానే ఉన్నట్లు తెలుస్తుంది. ఇకపోతే అన్ని కార్యక్రమాలను సిద్ధం చేసుకున్న ఈ సినిమాకి ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్ కూడా ఓపెన్ అయ్యాయని అయితే బాలీవుడ్ ఇండస్ట్రీలో ఇదివరకు విడుదలైన సినిమాలతో పోలిస్తే ఈ సినిమాకు కాస్త ఎక్కువగానే టికెట్స్ బుక్ అయ్యాయని తెలుస్తోంది. ఈ సినిమా టికెట్ బుకింగ్స్ తో బాలీవుడ్ కాస్త ఊపిరి పీల్చుకుంటున్నట్లు తెలుస్తుంది. అయితే ఎన్నో అంచనాల నడుమ అత్యంత భారీ బడ్జెట్ లో తెరకెక్కిన ఈ సినిమా 9వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎలాంటి ఆదరణ సంపాదించుకుంటుందో తెలియాల్సి ఉంది.