కృష్ణవంశీ క్రియేటివిటీ కోసం ఎదురు చూస్తున్న రమ్యకృష్ణ అండ్ ఫ్యాన్స్ ..

గులాబీ, నిన్నేపెళ్లాడతా, సింధూరం, చంద్రలేఖ, అనంతపురం, మురారి, చక్రం, నక్షత్రం, పైసా, గోవిందుడు అందరివాడేలే.. లాంటి సినిమాలతో టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నాడు కృష్ణవంశీ. తన క్రియేటివిటీతో..తెలుగు ఇండస్ట్రీలో తనకంటూ ఓ మార్క్‌ ను సృష్టించాడు. అందుకే ఎన్నో మరిచిపోని మధురమైన చిత్రాలు మన ముందు నిలిచాయి. కృష్ణవంశీ చేసిన ఫ్లాప్ సినిమాలు ఉన్నాయి. కానీ ఆయన ప్రేక్షకుల్లో ఎనలేని ఆదరణను పొందారు. అందకే ఇప్పటికీ కృష్ణ వంశీ క్రియేటివిటీ కోసం ఎదురుచూసే ఫ్యాన్స్ ఉన్నారు.

Ranga Marthanda Songs Download | Ranga Marthanda Naa Songs 2020 Telugu

గత కొంత కాలంగా వరుసగా ఫ్లాప్ లను చూస్తున్న కృష్ణ వంశీ ప్రస్తుతం రంగమార్తాండ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. అయితే ఈ సినిమా మొదలై రెండేళ్ళు అవుతోంది. కాని ఇంకా షూటింగ్ పూర్తికాలేదు. అందుకు కరోనా కూడా ఒక కారణం అని చెప్పాలి. ప్రస్తుతం అన్ ప్రక్రియతో మళ్లీ మూవీ రీ షూట్ ప్రారంభించారు కృష్ణవంశీ. అయితే ఈ మూవీకి స్పెషల్ అట్రాక్షన్ రమ్యకృష్ణ అని చెప్పాలి. చాలా ఏళ్ల తరువాత కృష్ణవంశీ, రమ్యకృష్ణలు కలిసి పనిచేయనున్నారు. ఇందులో కీలక పాత్రలో నటించనుంది రమ్య. అందుకే తన పాత్ర మీద కృష్ణ వంశీ ప్రత్యేక శ్రద్ద పేట్టాడు. ముఖ్యంగా రంగమార్తాండలో రమ్య ఓ కళాకారిణిగా నటిస్తోందని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది.

దీంతో ఈ సినిమా రిలీజ్ కోసం ప్రేక్షకులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. అదే విధంగా శివాత్మిక రాజశేఖర్ తో పాటు ప్రముఖ సీనియర్ కమెడియన్ బ్రహ్మానందం, అనసూయ తదితరులు ఈ మూవీలో కీలక పాత్రల్లో కనిపించనున్నారు. అంతేకాదు బిగ్ బాస్ ద్వారా బాగా పాపులర్ అయిన రాహుల్ సిప్లింగ్ ఓ కీలక సన్నివేశంలో నటించనున్నారు. కాగా ఈ సినిమాతో ఎలాగైనా తన హిట్ ట్రాక్ ను సెట్ చేసి…తన మార్క్ ను చూపించే ప్రయత్నం చేస్తున్నారు కృష్ణవంశీ. ఇక ఈ మూవీ వచ్చే ఏడాది సమ్మర్ లో రిలీజ్ చేయాలని చూస్తున్నారట మేకర్స్.