వైరల్ : “రంగ మార్తాండ” పై మెగాస్టార్ రివ్యూ.!

265252-rangamarthandaspecialpreimeir

తెలుగు సినిమా దిగ్గజ హీరో మెగాస్టార్ చిరంజీవి హీరోగా ఇప్పుడు “భోళా శంకర్” అనే మరో మాస్ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. మరి మెగాస్టార్ తన సినిమా పట్లే కాకుండా ఏ ఇతర చిన్న సినిమా అయినా పెద్ద సినిమా అయినా కూడా భేదం లేకుండా తనకి నచ్చింది అంటే దాని కోసం మాట్లాడకుండా ఉండలేరు.

మరి అదే విధంగా లేటెస్ట్ గా టాలీవుడ్ ప్రేక్షకుల దగ్గరకి వచ్చి మంచి మన్ననలు పొందుతున్న చిత్రం “రంగమార్తాండ” పై మెగాస్టార్ తన ప్రశంసలు కురిపించకుండా ఉండలేకపోయారు. ఇది వరకే సినిమా రిలీజ్ కాక ముందు దర్శకుడు కృష్ణవంశీ కోరికతో సినిమాలో ఓ పాట లాంటి దానికి తన పవర్ ఫుల్ గాత్రాన్ని మెగాస్టార్ అందించారు.

ఇక ఇప్పుడు సినిమా చూసిన తర్వాత అయితే తన అనుభూతిని ఈ రకంగా పంచుకున్నారు. “‘రంగమార్తాండ’ చూశాను. ఈ మధ్య కాలం లో చేసిన సినిమాల్లో ఇది ఒక ఫైనెస్ట్ సినిమా. ప్రతి ఆర్టిస్ట్ కి తన జీవితాన్నే కళ్ళ ముందు చూస్తున్నట్టనిపిస్తుంది. అలాగే ఈ చిత్రం ఓ ‘త్రివేణీ సంగమం’ లా అనిపించింది.

కృష్ణవంశీ లాంటి ఒక క్రియేటివ్ డైరెక్టర్, ప్రకాష్ రాజ్ లాంటి జాతీయ ఉత్తమ నటుడు, ఒక హాస్య బ్రహ్మానందం ల కలయిక, వారి పనితనం, ముఖ్యంగా ఆ ఇద్దరు అద్భుతమైన నటుల నటన ఎంతో భావోద్వేగానికి గురిచేసింది. బ్రహ్మానందం ఇంత ఇంటెన్సిటీ వున్న ఓ అనూహ్య మైన పాత్రని చేయటం తొలిసారి.

సెకండ్ హాఫ్ మొత్తం అప్రయత్నంగానే కంట తడి నిండింది. ఓ కంప్లీట్ ఎమోషనల్ జర్నీ అయిన ఇలాంటి చిత్రాలు అందరూ చూసి ఆదరించవలసినవి. ఇలాంటి రసవత్తరమైన చిత్రం తీసిన కృష్ణవంశీకి, ప్రకాష్ రాజ్ కి, రమ్యకృష్ణ కీ చిత్ర యూనిట్ అందరికీ అభినందనలు!” అని మెగాస్టార్ తెలియజేసారు. దీనితో ఈ మెగా రివ్యూ వైరల్ గా మారింది.