కృష్ణవంశీ దర్శకత్వంలో చిరంజీవి.?

మెగాస్టార్ చిరంజీవితో ఓ సినిమా చేయాలన్నది క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ కల.! చాలాకాలంగా ఆయన చిరంజీవితో సినిమా చేయడానికి నానా రకాల ప్రయత్నాలు చేశారు, చేస్తూనే వున్నారు. ‘వందేమాతరం’ పేరుతో ఏనాడో కృష్ణవంశీ కథ సిద్ధం చేసుకున్నారు చిరంజీవి కోసం.

ఇక, ఇప్పుడు తాజాగా చిరంజీవితో కృష్ణవంశీ ఆ ‘వందేమాతరం’ స్క్రిప్టు గురించి చర్చించినట్లు తెలుస్తోంది. అయితే, చిరంజీవి గ్రీన్ సిగ్నల్ ఇస్తారా.? ఇవ్వరా.? అన్నదైతే ప్రస్తుతానికి సస్పెన్స్.

‘రంగమార్తాండ’ సినిమా విడుదల తర్వాత, సినిమాకి వచ్చే రెస్పాన్స్‌ని బట్టి, చిరంజీవి వైపు నుంచి ‘గ్రీన్ సిగ్నల్’ రావడమా.? షరామామూలుగానే ‘రెడ్’ సిగ్నల్ పడటమా.? అన్నది తేలుతుందన్నది ఓ వాదన.

కాగా, చిరంజీవి కూడా ఈసారి కృష్ణవంశీ దర్శకత్వంలో సినిమా చేయాలనే పట్టుదలతో వున్నారన్నది ఇన్‌సైడ్ సోర్సెస్ కథనం. కృష్ణవంశీ – రామ్ చరణ్ కాంబినేషన్‌లో ‘గోవిందుడు అందరివాడేలే’ సినిమా వచ్చిన సంగతి తెలిసిందే.