పవిత్ర లోకేష్, నరేశ్ గురించి మరోసారి షాకింగ్ కామెంట్స్ చేసిన రమ్య రఘుపతి..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో నటుడు నరేష్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ పవిత్ర లోకేష్ కి సంబంధించిన వార్తలు ఎప్పటికప్పుడు వైరల్ అవుతూనే ఉన్నాయి. వీరి గురించి ఏ చిన్న వార్త బయటికి వచ్చిన సరే ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా నిలుస్తోంది. కొంతకాలం క్రితం ఇద్దరు సహజీవనం చేస్తున్నామని అంగీకరించిన ఈ జంట ఇటీవల న్యూ ఇయర్ సంవత్సరం సందర్భంగా వారు పెళ్లి చేసుకోబోతున్నట్లు ఒక వీడియో షేర్ చేశారు. అయితే ఈ వీడియోలో నరేష్, పవిత్ర లోకేష్ ఇద్దరు లిప్ లాక్ పెట్టుకోవడం హాట్ టాపిక్ గా మారింది. ఈ సందర్భంగా నరేశ్ మూడో భార్య రమ్య రఘుపతి మరొకసారి తెరపైకి వచ్చి వీరి గురించి సంచలన వ్యాఖ్యలు చేసింది. గతంలో వీరిద్దరూ హోటల్ గదిలో ఉండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొని వారి మీద దాడి చేయడానికి ప్రయత్నం చేసింది.

ఇక ఇక నరేష్ పవిత్ర లోకేష్ పెళ్లి వార్త వైరల్ కావడంతో ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న రమ్య రఘుపతి వారి పెళ్లి జరగనివ్వను అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. ఇక ఈ ఇంటర్వూ లో నరేశ్ గురించి మాట్లాడుతూ…నరేష్ కి అమ్మాయిల పిచ్చి చాలా ఉందని తెలిపింది. అందుకే నరేష్ నా వెంట కూడా చాలా రోజులు తిరిగాడు. దాంతో నేను ఆయన మాయలో పడి తన ప్రేమ నిజమేనని నమ్మి ఇంట్లో వాళ్ళని ఎదిరించి మరి పెళ్లి చేసుకొని మోసపోయాను అంటూ చెప్పుకొచ్చింది. ఇక పవిత్రా తో నరేష్ కి పరిచయం ఏర్పడిన తర్వాత తనతో కూడా తరచూ గొడవ పడేవాడని ఎప్పుడు ఆమెతోనే కలిసి తిరిగేవాడని వెల్లడించింది.

అయితే పవిత్ర నరేష్ పెళ్లి ఎట్టి పరిస్థితుల్లోనూ జరగనివ్వనని చెప్పుకొచ్చింది. తన పది సంవత్సరాల కుమారుడికి తండ్రి తోడు ఉండాలని నరేష్ ఎన్ని వెధవ వేషాలు వేసినా కూడా అతనికి విడాకులు ఇచ్చే ప్రసక్తి లేదని రమ్య రఘుపతి స్పష్టం చేసింది. నరేష్ నిజస్వరూపం బయటపడటంతో తన తనపై నిందలు వేస్తూ నలుగురిలో తన పరువు తీస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేసింది. నరేష్ కి ఉన్న అమ్మాయిల పిచ్చి కారణంగానే పవిత్ర లోకేష్ తో సహజీవనం చేస్తున్నాడని, అలాగే పవిత్ర కి డబ్బు మీద ఆశ ఉండటం వల్లే నరేష్ తో కలిసి తిరుగుతోంది అంటూ చెప్పుకొచ్చింది. నరేష్ కి ఉన్న కోట్ల రూపాయల ఆస్తుల మీద ఉన్న ఇష్టం తోనే పవిత్ర నరేష్ ని పెళ్లి చేసుకోవటానికి సిద్ధపడినట్లు చెప్పుకొచ్చింది. అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ వారి పెళ్లి జరగనివ్వను అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది.