సెన్సార్ పూర్తి చేసుకుని విడుదలకి సిద్దమవుతున్న రామ్ ‘రెడ్’

ram red movie sensor completed and release on january 14

ఇటీవల ఇస్మార్ట్ శంకర్ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న రామ్ పోతినేని తెలుగు చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోగా ఎదిగాడు. దేవదాసు సినిమాతో వెండితెరకు పరిచయం అయ్యి, మొదటి సినిమాతోనే భారీ హిట్ అందుకుని తనని తానూ ప్రూవ్ చేసుకున్నాడు. దాని తరువాత చేసిన సినిమానులు కొన్ని అనుకున్న రేంజ్‌లో ఆడకపోయినా రామ్ మాత్రం ప్రతి సినిమాలో ఓ ప్రత్యేక యాంగిల్‌ను చూపించాడు. గత సంవత్సరం పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రామ్ హీరోగా చేసిన “ఇస్మార్ట్ శంకర్” సినిమాతో తన రేంజ్ ని పెంచుకున్నాడు. ప్రస్తుతం రామ్ తిరుమల కిశోర్ దర్శకత్వంలో “రెడ్” అనే సినిమాలో నటిస్తున్నారు.ఇప్పటికే వీరిద్దరి కంబినేషన్ లో వచ్చిన గత రెండు సినిమాలు సక్సెస్ అయ్యాయి. ఇప్పుడు ఈ క్రేజీ కాంబినేషన్ లో వస్తున్న హ్యాట్రిక్ మూవీ “రెడ్ ” ట్రైలర్ రీసెంట్ గా విడుదల చేశారు.ఈ సినిమాలో రామ్ డ్యూయల్ రోల్ చేసినట్లుగా అర్ధమవుతుంది. ట్రైలర్ తో సినిమా మీద మంచి ఆసక్తి తో పాటుగా అభిమానుల్లో భారీ అంచనాలు పెరిగాయి. అంతేకాకుండా ఇస్మార్ట్ శంకర్‌కు అద్భుతమైన ఆల్బమ్ అందించిన మణిశర్మ రెడ్‌కు కూడా మంచి ఆల్బమ్ ఇచ్చారు.

ram red movie sensor completed and release on january 14
ram’s red movie sensor completed and release on january 14

అయితే ఈ సినిమా ఈ సంక్రాంతికి బరిలోకి దిగేందుకు సిద్దమవుతోంది. ఈ రోజు సెన్సార్ పూర్తి చేసుకుంది. U/A సర్టిఫికెట్ వచ్చింది. దేవదాసు, మస్కా తర్వాత రామ్ మళ్లీ ఇప్పుడు సంక్రాంతి బరిలో దిగేందుకు సిద్ధమవుతున్నాడు. ఈ సినిమాను జనవరి 14న విడుదల చేయనున్నారు. ఇందులో రామ్ నుంచి ప్రేక్షకులు ఆశించేటటువంటి అన్ని సన్నివేశాలు ఉన్నాయని నిర్మాత స్రవంతి తెలిపారు. ఈ సినిమా ట్రైలర్ ఇప్పటికే యూట్యూబ్‌లో భారీగా ట్రెండ్ అవుతోంది. థియేటర్స్‌లో ట్రైలర్ ప్రేక్షకులకు సినిమా చూడాలనిపించేలా ప్రేరేపిస్తుంది. ఈ సినిమాలో రామ్ చేసిన రెండు పాత్రలు విలక్షణంగా ఉండటంతో ఈ సినిమాపై ఉన్న అంచనాలను రామ్ అధిగమిస్తాడా అనేది తెలియాలంటే వేచి చూడాల్సిందే.