Ram Pothineni: ఇస్మార్ట్ హీరో తో శ్రీవల్లి చేయనుందా… బోయపాటి ఆలోచన ఏమిటో?

 

Ram Pothineni:ఎనర్జిటిక్ హీరో రామ్ తన నెక్స్ట్ మూవీ ని బోయపాటి డైరెక్షన్ లో తీయనున్నాడని ప్రకటించాక ఫ్యాన్స్ లో అంచనాలు భారీగా పెరిగాయి. అఖండ మాస్ సక్సెస్ తర్వాత బోయపాటి తన తదుపరి చిత్రంగా రామ్ తో ఒక యాక్షన్ ప్యాక్ సినిమా తీయబోతున్నాడు.ఈ సినిమా ను పాన్ ఇండియా లెవెల్ లో ప్లాన్ చేస్తున్నారు చిత్ర యూనిట్. తెలుగు, మలయాళం, తమిళ, కన్నడ, హిందీ భాషలలో రిలీజ్ చేయాలనీ భావిస్తున్నారు. ఇటీవల ఈ ప్రాజెక్టుకు సంబంధించి అధికారిక ప్రకటన కూడా రావడం జరిగింది. శ్రీనివాస శ్రీనివాస స్క్రీన్ పతాకంపై చిట్టూరి శ్రీనివాస్ ఈ సినిమా నిర్మిస్తున్నారు

ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించి పోస్ట్ ప్రొడక్షన్ పనులు ప్రారంభించారట.తాజాగా సినిమాలో హీరోయిన్ మరియు ఇతర నటీనటుల సెలెక్షన్ ప్రక్రియ మొదలైందని సమాచారం. ఇక హీరోయిన్ విషయానికి వస్తే బోయపాటి దర్శకత్వంలో రామ్ పక్కన హీరోయిన్గా ఇప్పటికే కొన్ని వార్తలు వినిపించాయి. కానీ రామ్ కు జోడీగా నేషనల్ బ్యూటీ రష్మిక మందన అయితే బాగుంటుందని దర్శకుడు బోయపాటి భావిస్తున్నట్టు సమాచారం.సినిమాలో హీరోయిన్ పాత్రకు రష్మిక అయితే పర్ఫెక్ట్ గా ఉంటుందని అనుకుంటున్నారట. ఇప్పటికే రష్మిక టాలీవుడ్ లోని యంగ్ హీరో అయినా విజయ్ దేవరకొండ, మహేష్ బాబు, అల్లు అర్జున్, నాని, నితిన్, శర్వానంద్ వంటి హీరోలతో నటించింది. ఈ సినిమాలో హీరోయిన్ గా రష్మిక ఓకే అయితే రామ్ జోడిగా మొదటిసారి నటించబోతోంది. ఈ విషయం మీద చిత్రబృందం హీరోయిన్ ని సంప్రదించడం రష్మిక సానుకూలంగా స్పందించడం కూడా జరిగిందట.

బాలీవుడ్లో రష్మిక గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నేషనల్ క్రష్ గా చాలా పాపులారిటీ సంపాదించుకుంది.ఇటీవలే పుష్ప సినిమాతో పాన్ ఇండియా హిట్ అందుకుంది రష్మిక. ఇక రామ్, బోయపాటి సినిమాలో రష్మిక ను ఎంచుకోవడానికి పాన్ ఇండియా ప్రేక్షకుల్లో ఆమెకున్న క్రేజ్ కూడా ఒక కారణమని అంటున్నారు.ఇక రామ్ విషయానికి వస్తే బాలీవుడ్ లో హిందీ డబ్బింగ్ సినిమాలతో రామ్ పోతినేని కి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది.అటు బోయపాటి శీను సినిమాలు కూడా హిందీలో డబ్బింగ్ అయ్యి మిలియన్ల సంఖ్యలో వ్యూస్ తెచ్చుకున్నాయి.ఈ మాస్ ఎంటర్టైనర్ కోసం ఫ్యాన్స్ అంచనాలు కూడా బాగానే పెట్టుకున్నారు