రామ్ చరణ్ కెరియర్ ఆరంభంలో మగధీర తర్వాత చేసిన సినిమా ఆరెంజ్. ఈ మూవీ ఎంత పెద్ద డిజాస్టర్ అయ్యిందో అందరికి తెలిసిందే. రామ్ చరణ్ కెరియర్ లో బిగ్గెస్ట్ డిజాస్టర్ గా మారిన ఈ మూవీ నిర్మాతగా నాగబాబుకి కూడా నష్టాలు తీసుకొచ్చింది. ఆ రోజుల్లోనే ఏకంగా 40 కోట్ల వరకు ఈ సినిమాకి ఖర్చు పెట్టారు.
ఇక సినిమా రిలీజ్ తర్వాత డిఫరెంట్ కథ అనే టాక్ వచ్చిన కూడా ప్రేక్షకులకి అస్సలు కనెక్ట్ కాలేదు. వచ్చిన సీన్స్ మళ్ళీ మళ్ళీ వచ్చినట్లు అనిపించడం, అలాగే నేటివిటీకి దూరంగా వేరే దేశంలో తెరకెక్కించడంతోనే ఆరెంజ్ డిజాస్టర్ అయ్యింది. అయితే ఈ సినిమాలోని సాంగ్స్, అలాగే కంటెంట్ ప్లాట్ ని ఆడియన్స్ ఇష్టపడతారు.
ఈ జెనరేషన్ కి భాగా కనెక్ట్ అయ్యే పాయింట్ అని అందరూ చెప్పే మాట. ఇదిలా ఉంటే రామ్ చరణ్ బర్త్ డే సందర్భంగా ఆరెంజ్ మూవీని మార్చి 27న రీరిలీజ్ చేస్తున్నారు. ఈ మధ్యకాలంలో స్టార్ హీరోల హిట్ సినిమాలు రిలీజ్ చేయడం ఒక ఆనవాయితీగా మారిపోయింది. ఆ వచ్చిన కలెక్షన్స్ ని ఎన్జీవోలకి ఇవ్వడం, లేదంటే సోషల్ యాక్టివిటీస్ కోసం ఉపయోగించడం చేస్తున్నారు.
ఇక పవన్ కళ్యాణ్ సినిమాల రీరిలీజ్ ద్వారా వచ్చిన డబ్బుని జనసేన పార్టీకి ఫండ్ గా ఇచ్చారు. ఇదిలా ఉంటే ఇప్పుడు ఆరెంజ్ తో డిజాస్టర్ సినిమాలని కూడా రీరిలీజ్ చేయొచ్చు అని చూపించరు. ఇక ఈ మూవీ బుకింగ్స్ కూడా భాగా జరుగుతున్నాయని తెలుస్తుంది. ఇక ఈ సినిమా ద్వారా వచ్చే ఆదాయం మొత్తం జనసేన పార్టీ చేపడుతున్న కౌలురైతు భరోసాకి ఇస్తానని నాగబాబు తెలిపారు. ఈ నేపధ్యంలో జనసైనికులు, పవన్ కళ్యాణ్ అభిమానులు ఎక్కువగా ఈ సినిమా కోసం టికెట్లు కొనడానికి రెడీ అవుతున్నారు.
అలాగే మెగా అభిమానులు కూడా ఆరెంజ్ సినిమాని ఇష్టపడుతూ ఉంటారు. ఈ నేపధ్యంలో వారు కూడా సినిమా పట్ల ప్రత్యేక ఆసక్తి చూపిస్తున్నట్లు తెలుస్తుంది. ఇక ఈ మూవీ గాని రీరిలీజ్ లో కలెక్షన్స్ పరంగా రికార్డులు క్రియేట్ చేస్తే తరువాత మిగిలిన స్టార్ హీరోలకి సంబందించిన ఫ్లాప్ సినిమాలని కూడా రీరిలీజ్ చేయడానికి ఆసక్తి చూపించే ఛాన్స్ ఉందనే మాట టాలీవుడ్ సర్కిల్ లో వినిపిస్తుంది.