వైరల్ టాక్ : పవన్ కోసం చరణ్ డిజిటల్ ఛానెల్?

Ram charan about Chiranjeevi and Pawan kalyan At Uppena Success event

టాలీవుడ్ లో ఉన్న బిగ్గెస్ట్ ఫ్యామిలీ మెగా ఫామిలీ లో హీరోలు ఇప్పుడు సినిమాలు అలాగే కొందరు రాజకీయాల్లో కూడా బిజీగా ఉన్నారు. మరి మొదటగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అయితే ఇపుడు తన జనసేన పార్టీ తో బిజీగా ఉండగా ఓ పక్క పరోక్షంగా తన కుటుంబం నుంచి పవన్ కి సపోర్ట్ అందిస్తున్నారు.

ఇక పవన్ విషయంలో ఎప్పుడూ కూడా పాజిటివ్ గా ఉండే మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ అయితే లేటెస్ట్ గా ఓ కీలక నిర్ణయం పవన్ కళ్యాణ్ విషయంలో తీసుకున్నట్టుగా ఓ టాక్ ఇప్పుడు పెద్ద ఎత్తున వైరల్ అవుతుంది. ప్రస్తుతం చరణ్ బాబాయ్ కోసం అయితే ఓ డిజిటల్ ఛానెల్ ని అయితే తన పర్సనల్ టీం తో కొనుగోలు చేసినట్టుగా తెలుస్తుంది.

దీనితో మెగా ఫ్యాన్స్ అయితే ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరి ఇది వరకు అయితే ఎలక్ట్రానిక్ మీడియాలో అయితే ఓ ఛానెల్ కొనే ప్రయత్నం చేసారని కూడా టాక్ వచ్చింది. కానీ ప్రస్తుతానికి అయితే చరణ్ డిజిటల్ ఛానెల్ కొనుగోలు చేసి తన వంతుగా బాబాయ్ కి అండగా ఉండే ప్రయత్నం చేస్తున్నాడట.

మరి ఆ ఛానెల్ ఏంటి ఇది నిజమేనా కాదా అనేది ఇంకా తెలియాల్సి ఉంది. కాగా ఇప్పుడు చరణ్ అయితే భారీ చిత్రం “గేమ్ ఛేంజర్” సినిమాతో బిజీగా ఉండగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ లో అయితే బిజీగా ఉన్నారు.