మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో నటిస్తున్న తాజా చిత్రం ఆచార్య. ఈ చిత్రంపై అంచనాలు ఎంత భారీగా ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.తాజాగా ప్రారంభమైన ఈ సినిమా షూటింగ్‌లో చిరంజీవి జాయిన్ అయ్యారు. మరోవైపు రామ్ చరణ్ కూడా ఈ సినిమా షూటింగ్‌లో జాయిన్ అయిదానుకునే లోపు కోవిడ్ బారిన పడ్డారు. తాజాగా రామ్ చరణ్ కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నారు.
దీనితో ‘ఆచార్య’ సెట్‌లో అడుగు పెట్టాడు. ఈ రోజు నుంచి రామ్ చరణ్.. ఆచార్య రెగ్యులర్ షూటింగ్‌లో జాయిన్ అయ్యాడు. ఈ సందర్భంగా మా ‘సిద్ధ’ సర్వం అంటూ దర్శకుడు కొరటాల శివ.. రామ్ చరణ్‌కు స్వాగతం పలికాడు. ఈ సినిమాలో చెర్రీ ఓ కీలక పాత్రలో నటిస్తున్నట్లు చాలా కాలంగా వార్తలు వస్తున్నాయి. దీన్ని కన్ఫార్మ్ చేసింది ఆ సినిమా యూనిట్. రామ్ చరణ్ ఎన్నడూ లేని విధంగా కొత్త లుక్‌లో మెడలో రుద్రాక్ష, చెవికి పోగుతో కనపడుతున్నాడు.
ఇప్పటికే మగధీర, బ్రూస్లీ, ఖైదీ నెం 150 సినిమాల్లో కలిసి కనిపించారు చిరు, రామ్ చరణ్. కానీ అవన్నీ కొన్ని నిమిషాల పాటు వచ్చి మాయం అవుతుంటాయి. కానీ ఆచార్యలో అలా కాదు.. దాదాపు చిరంజీవి, రామ్ చరణ్ స్క్రీన్ పై అరగంటకు పైనే ఉంటుందని సమాచారం. కానీ కొరటాల శివ మాత్రం ఈ సినిమాలో రామ్ చరణ్ పాత్రను గంట వరకు పొడిగించినట్టు సమాచారం.
https://twitter.com/sivakoratala/status/1350661983444471809?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1350661983444471809%7Ctwgr%5E%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Ftelugu.news18.com%2Fnews%2Fmovies%2Fmega-power-star-ram-charan-grand-entry-into-chiranjeevi-koratala-sivas-acharya-set-in-siddha-role-ta-727366.html