వైరల్ : సునిశిత్ ని ఉతికారేసిన చరణ్ ఫ్యాన్స్..ఫుల్ స్టోరీ ఇదే.!

టాలీవుడ్ సినిమా దగ్గర ఏదొకలా ఫేమస్ అవ్వాలని చాలా మందికి చాలా రకాలుగా అయితే ప్రయత్నిస్తూ ఉంటారు. అయితే అందులో కొందరు మంచి దారులు కొందరు చెడు దారులు ఎంచుకుంటారు. మరి ఈ రెండు కూడా కాకుండా తింగరి దారి ఎంచుకున్న ఓ ప్రభుద్ధుడే సాక్రిఫైజింగ్ స్టార్ సునిశిత్.

ఇతగాడి కోసం తెలుగులో సోషల్ మీడియా బాగా ఉపయోగించే వారికి తెలియకుండా ఉండదు. ఎందరో స్టార్ హీరోయిన్స్ స్టార్ హీరోల పై సంచలన కామెంట్స్ చేస్తూ పాపులర్ అయ్యిన ఈ కాంట్రవర్సియల్ కమెడియన్ పై గతంలో గట్టి వార్నింగ్ లు పోలీస్ కోటింగ్ లు కూడా జరిగాయి.

అయితే ఇప్పుడు ఏకంగా మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ఫ్యాన్స్ అయితే ఇతన్ని సుబ్బరంగా ఉతికి ఆరేసేసారు. ఇప్పుడు ఈ విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా ఇతన్ని రామ్ చరణ్ ఫ్యాన్స్ ఎందుకు అంతలా కొట్టారో అసలు కథ ఏంటో చూడండి.

ఎప్పటిలానే పిచ్చి పిచ్చి ఇంటర్వూస్ కి పని లేని వాళ్ళు పిలవడం అందులో ఇతన్ని అడిగే ప్రశ్నలకి సంబంధం లేకుండా ఇతడు ఆన్సర్ ఇవ్వడం జరిగింది. అయితే ఈసారి అతడు రామ్ చరణ్ భార్య అయినటువంటి ఉపాసన కొణిదెల మీద పలు అభ్యంతరకర వ్యాఖ్యలు చేసాడు.

దీనితో ఇది చూసిన రామ్ చరణ్ అభిమానులు అయితే ఇతడిని పట్టుకొని గట్టిగా దేహ సుద్ధి చేసి వదిలేసారు. దీనితో ఇప్పుడు ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దీనితో ఇలాంటి కేటుగాళ్ళకి ఇలాంటివి జరిగితే తప్ప బుద్ది రాదు అని ఇతర హీరోల అభిమానులు కూడా చరణ్ ఫ్యాన్స్ చేసిన పనికి మద్దతు ఇస్తున్నారు.