Home News బాబోయ్ రానున్న రోజుల‌లో ర‌కుల్ చాలా బిజీ.. చాంతాడంత లిస్ట్ విడుద‌ల చేసిన టీం

బాబోయ్ రానున్న రోజుల‌లో ర‌కుల్ చాలా బిజీ.. చాంతాడంత లిస్ట్ విడుద‌ల చేసిన టీం

పంజాబీ సోయ‌గం ర‌కుల్ ప్రీత్ సింగ్ వెనుకే అదృష్టం ప‌రిగెడుతుందా అనిపిస్తుంది. తెలుగు ,త‌మిళం, హిందీ భాష‌ల‌లో స్టార్ హీరోల స‌ర‌స‌న న‌టించిన ఈ అమ్మ‌డు చెప్పుకోద‌గ్గ స‌క్సెస్ ఒక్క‌టి కూడా అందుకోలేదు. అయిన‌ప్ప‌టికీ వ‌రుస ఆఫ‌ర్స్‌తో జెట్ స్పీడ్‌తో దూసుకెళుతుంటుంది. దాదాపు ఐదేళ్ళుగా సినీ ప్రేక్ష‌కుల‌ని అల‌రిస్తూ వ‌స్తున్న ర‌కుల్ ప్రాజెక్ట్స్‌కి సంబంధించి ఆమె మేనేజ‌ర్ హ‌రినాథ్ పూర్తి క్లారిటీ ఇచ్చారు. గ‌త కొద్ది కాలంగా సోష‌ల్ మీడియాలో ఏవేవో వార్త‌లు వ‌స్తున్న నేప‌థ్యంలో ఆయ‌న ఈ వివ‌ర‌ణ ఇచ్చారు.

Telugu Most Popular Actress Rakulpreet Singh Latest Photos ,Tollywood Rakulpreet Singh Latest Photos Shooting Spot Photos,Latest Photos In Telugu Rajyam,
 

రకుల్ ప్రస్తుతం నితిన్ హీరోగా తెర‌కెక్కుతున్న‌ ‘చెక్’ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వం వ‌హిస్తున్న ఈ చిత్రంలో రకుల్ అడ్వకేట్ పాత్రలో కనిపించనుంది. దీంతో పాటు మెగా హీరో పంజా వైష్ణవ్ తేజ్ – క్రిష్ జాగర్లమూడి కాంబినేషన్ లో రూపొందుతున్న సినిమాలో కూడా రకుల్ నటిస్తోంది. పల్లెటూరి అమ్మాయిగా ఇందులో న‌టిస్తుండ‌గా, ఇప్ప‌టికే ఈ షూటింగ్ పూర్త‌యింది . ఇక బాలీవుడ్‌లోను దూసుకుపోతున్న ర‌కుల్ స్టార్ హీరో జాన్ అబ్రహాంతో కలిసి ‘ఎటాక్’ అనే సినిమాలో నటిస్తోంది. అలానే అర్జున్ కపూర్ తో కలిసి ఓ సినిమా చేస్తోంది రకుల్. దీనికి ఇంకా టైటిల్ అనౌన్స్ చేయ‌లేదు.

ఇక అమితాబ్ ప్ర‌ధాన పాత్ర‌లో అజ‌య్ దేవ‌గ‌ణ్ తెర‌కెక్కిస్తున్న మేడే సినిమాలో ర‌కుల్ ముఖ్య పాత్ర పోషిస్తుంది. ఈ మూడు చిత్రాల‌తో బాలీవుడ్‌లో బిజీగా మారింది ర‌కుల్. ఇక కోలీవుడ్ విష‌యానికి వ‌స్తే శివ కార్తికేయన్ హీరోగా నటిస్తున్న ‘అయలాన్’ చిత్రంలోనూ రకుల్ నటిస్తోంది. వామ్మో ఈ అమ్మ‌డి ప్రాజెక్ట్ లిస్ట్ పరిశీలిస్తే మిగ‌తా హీరోయిన్స్‌కు అసూయ పుట్ట‌డం ఖాయంగా క‌నిపిస్తుంది. ప్ర‌స్తుతం త‌న ఫ్యామిలీతో మాల్దీవుల‌లో ఎంజాయ్ చేస్తున్న ర‌కుల్ త్వ‌ర‌లోనే హైద‌రాబాద్‌కు రానుంది.

- Advertisement -

Related Posts

రోబో దర్శకుడితో చరణ్, పవన్.. వామ్మో.. ఇదెక్కడి కాంబో!

ఒక మల్టీస్టారర్ సినిమా సెట్స్ పైకి వచ్చే వరకు ఒకప్పుడు అభిమానులు నమ్మేవారు కాదు. అయితే చాలా కాలం తరువాత అగ్ర హీరోలు ఈగోలను పక్కనపెట్టే సినిమాలను వెండితెరపైకి తీసుకు వస్తున్నారు. ఇక...

స్టార్ హీరో పెళ్లి వేడుక.. మాజీ లవ్ బర్డ్స్ కు స్పెషల్ ఇన్విటేషన్

బాలీవుడ్ లో త్వరలో ఒక యువ హీరో పెళ్లి చేసుకోబోతున్న విషయం తెలిసిందే. బ్యాక్ టూ బ్యాక్ కమర్షియల్ హిందీ సినిమాలతో బాక్సాఫీస్ వద్ద సాలీడ్ హిట్స్ అందుకుంటున్న వరుణ్ ధావన్ త్వరలో...

నేను చస్తే వాటికి ఆహారం అవుతాను.. కమెడియన్ వింత కోరిక

సాధారణంగా ఎవరైనా సరే చనిపోతే అవయవదానం చేయడానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తారు. మరికొందరు ఉన్నతమైన వారు తన శరీరం జూనియర్ డాక్టర్స్ కు ఉపయోగపడాలని ఏకంగా బాడీని మెడికల్ కాలేజ్ కోర్సుల కోసం...

డిజాస్టర్ టాక్ వచ్చినా డోస్ తగ్గలేదు.. మాస్టర్ కు అప్పుడే అన్ని కోట్లా?

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ ఎలాంటి సినిమా చేసినా కూడా బాక్సాఫీస్ వద్ద మినిమమ్ 100కోట్లకు తక్కువగా రాబట్టవు. కథలో మ్యాటర్ లేకపోయినా కూడా విజయ్ క్యారెక్టర్ ను సరిగ్గా ఎలివేట్ చేస్తే...

Latest News