వైష్ణవ్‌ తేజ్‌తో రకుల్ ప్రీత్ సింగ్ ఇంకోస్సారి.!

నటుడిగా తొలి సినిమా ‘ఉప్పెన’తోనే తానేంటో నిరూపించుకున్న వైష్ణవ్ తేజ్ నుంచి ‘కొండపొలం’, ‘రంగ రంగ వైభవంగా’ సినిమాలొచ్చాయ్. ‘ఉప్పెన’ స్థాయి విజయం మళ్ళీ ఎప్పుడు.? అంటే, దానికి కాలమే సమాధానం చెప్పాలి.

కాగా, ‘కొండపొలం’ వెరీ వెరీ స్పెషల్ ఫలిం వైష్ణవ్ తేజ్‌కి. ఆ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్‌గా నటించింది. వైష్ణవ్‌తో పోల్చితే రకుల్ చాలా సీనియర్ హీరోయిన్ కిందే లెక్క. కానీ, ఇద్దరి మధ్యా కెమిస్ట్రీ బాగా సెట్ అయ్యింది ‘కొండ పొలం’ సినిమాలో.

ఇక, ఈ కాంబినేషన్ ఇంకోసారి రిపీట్ కాబోతోందిట. ఈసారి ఆన్ స్క్రీన్ రొమాన్స్ అని కాదుగానీ, ఇద్దరి మధ్యా ఇంట్రెస్టింగ్ కెమిస్ట్రీ వుండేలా ఓ కథ రెడీ అయ్యిందనీ, ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ ఈ సినిమాని పట్టాలెక్కించబోతోందనీ తెలుస్తోంది. ఆ కథకి రకుల్ తప్ప ఇంకో ఆప్షన్ లేదట.. కథ రెడీ చేసిన దర్శకుడి వద్ద. ఫుల్ డిటెయిల్స్ కమింగ్ సూన్.