ఈరోజు సూపర్ స్టార్ రజినీకాంత్ పుట్టినరోజు. అభిమానులకి ఈరోజు పెద్ద పండుగే. ఈరోజు ఆయన 73వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. పుట్టినరోజు సందర్భంగా సామాన్యుల దగ్గర్నుంచి విఐపి ల వరుకు అందరూ సోషల్ మీడియాలో ఆయనకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. తాజాగా మన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కూడా రజనీకాంత్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. నా ప్రియమైన మిత్రుడు, సూపర్ స్టార్ రజనీకాంత్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు.
ఆయన ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని జీవితంలో మరింత సక్సెస్ సాధించాలని కోరుకుంటున్నాను అంటూ గతంలో రజనీకాంత్ తో కలిసి ఉన్న ఫోటో ఒకటి షేర్ చేశారు దీంతో ఈ పోస్టు తెగ వైరల్ అయింది. చంద్రబాబు నాయుడు రజనీకాంత్ ఇద్దరు మంచి ఫ్రెండ్స్ అనే విషయం అందరికీ తెలిసిందే. గతంలో ఎన్టీఆర్ శతాబ్ది ఉత్సవాలకి చంద్రబాబు ఆహ్వానం మీద రజనీకాంత్ వచ్చి ఆ వేడుకలలో పాల్గొన్న సంగతి అందరికీ తెలిసిందే. ఆ మీటింగ్ పొలిటికల్ టర్న్ తీసుకున్న సంగతి కూడా తెలిసిందే.
రజనీకాంత్ కూడా చంద్రబాబు గొప్ప విజన్ ఉన్న నాయకుడని, రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే అది చంద్రబాబు తోనే సాధ్యమవుతుందని రజనీకాంత్ చెప్పారు.ఇక రజనీకాంత్ విషయానికి వస్తే ఆయన నాలుగు దశాబ్దాలకు పైగా వెండి తెరమీద నటిస్తూ మనల్ని అలరిస్తున్నారు. ఇప్పటికీ యువ హీరోలతో పోటీ పడుతూ వరుస విజయాలని అందుకుంటున్నారు తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం, ఇంగ్లీష్, హిందీ భాషలతో సహా పలు చిత్రాలలో నటించారు.
ఆయన సిగరెట్ స్టైల్ కి ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉంది. ఈయన లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో కూలీ సినిమాలో నటిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. తర్వాత జైలర్ 2 సినిమాలో కూడా నటిస్తారని ఆపై మణిరత్నం దర్శకత్వంలో రాబోయే సినిమాలో కూడా నటిస్తారని సమాచారం. ఈ వయసులో కూడా ఇంత కష్టపడుతున్న రజినీకాంత్ గారు మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని కోరుకుంటున్నారు నెటిజన్స్.
