ఈసారి ఆస్కార్స్ కి రాజమౌళి టీం భారీ ప్లానింగ్.!

Mahesh Babu

ఇప్పుడిప్పుడే మన తెలుగు సినిమా మరియు భారతీయ సినిమా కూడా అంతర్జాతీయ స్థాయిలో ఓ వెలుగు వెలుగుతుంది. మన తెలుగు మాస్ ఆడియెన్స్ లా ఓ పాటకి ఫారిన్ ఆడియెన్స్ ని కూడా ఉర్రూతలూ ఊగించిన దర్శకుడు రాజమౌళి చేసిన ఆర్ ఆర్ ఆర్ తో అదిరే వెల్కమ్ ని అందుకున్న చిత్ర యూనిట్ ఇక నెక్స్ట్ చేయబోయే సినిమా కోసం మరింత హైప్ ఆకాశాన్ని అంటుంతుంది.

అయితే ఆర్ ఆర్ ఆర్ కి ఆస్కార్ రావడం చరిత్రగా నిలిచింది. మరి ఇది రాజమౌళి అండ్ టీం ఆరంభం కాగా ఇక నెక్స్ట్ సూపర్ స్టార్ మహేష్ బాబు తో చేసే సినిమాకి మాత్రం పీక్ లో ఉండేలా ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఈసారి ఆస్కార్ లో అనేక క్యాటగిరీలలో తమ సినిమా నామినేషన్స్ లో నిలిచేలా ప్లాన్ చేస్తామని..

స్వయంగా రాజమౌళి తండ్రి, కథా రచయిత విజయేంద్ర ప్రసాద్ తెలిపారు. దీనితో ఇక నెక్స్ట్ నుంచి ఆస్కార్ లో కేవలం ఒక్క క్యాటగిరీ లో తమ సినిమా నిలవడం కాదు ఒకే సినిమాకి అన్ని విభాగాల్లో చోటు దక్కేలా చేస్తామని కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు.

ఈ సినిమా ఎలాగో ఇంటర్నేషనల్ లెవెల్లో రాజమౌళి బ్రాండ్ తో రిలీజ్ అవుతుంది. మరి ఆస్కార్స్ లో అనుకున్నంత పని ఈ సినిమాకి జరుగుతుందో లేదో మరికొన్నాళ్లు ఆగాల్సిందే. ఇక ఈ క్రేజీ ప్రాజెక్ట్ వచ్చే ఏడాది పట్టాలెక్కనుంది. కాగా ఎప్పటికి పూర్తి చేస్తారో అనేది చూడాలి.