Rajamouli : ప్రభాస్ కు రాజమౌళి కి మధ్య ఉన్న బంధం చాలా స్పెషల్ అని అందరు అంటారు. ఛత్రపతితో మొదలైన వీరి స్నేహం బాహుబలి తో ఇంకాస్త బలపడింది. అందుకే ప్రభాస్ అడగగానే జక్కన్న రాధే శ్యామ్ సినిమా కోసం బ్యాక్ గ్రౌండ్ వాయిస్ ఇచ్చాడు. ఇక రాధే శ్యామ్ విడుదల వరకు ప్రొమోషనల్ కార్యక్రమాలు బాగానే చేసారు. ఇందులో భాగంగా ప్రభాస్ తో రాజమౌళి ఇంటర్వ్యూ జరిగింది
ఈ ఇంటర్వ్యూ లో ఆసక్తికర మాటలు మాట్లాడారు రాజమౌళి. ఇంటర్వ్యూ లో భాగంగా ఎందుకు ఆర్ఆర్ఆర్ కోసం నన్ను ఎంచుకోలేదని అడిగాడు. కనీసం చిన్న సీన్ ఇచ్చుండొచ్చు కదా ఎన్టీఆర్, రామ్ చరణ్ తో కలిసి ఒక సీన్ చేసే వాడిని అని అన్నాడు ప్రభాస్. ఎన్టీఆర్, రామ్ చరణ్ సరసన నేను కూడా స్క్రీన్ మీద చాలా బాగుండేది కదా ముగ్గురం ఎందుకు తీసుకోలేదంటూ ప్రశ్నించాడు. పైగా నాతో కంటే రామ్ చరణ్, తారక్ తో నీకు ఎక్కువ చనువు ఉందని వాఖ్యనించాడు.
ఇక ప్రభాస్ ప్రశ్నలకు రాజమౌళి తనదైన శైలిలో సమాధానాలు చెప్పాడు. ఆర్ఆర్ఆర్ సినిమాలో నీలాంటి ఒక పెద్ద ఓడ ను నా సినిమాలో ఏదో ఒక పాత్రలో తీసుకోలేను.రాధే శ్యామ్ సినిమా లోని షిప్ సీన్ దృష్టిలో పెట్టుకుని సరదాగా వాఖ్యనించాడు రాజమౌళి.ఇక నాకు ప్రభాస్ తెలుసు కదా అని ఏదో ఒక సీన్ లో నిన్ను పెట్టలేను. నిజంగా నీ అవసరం ఉంటే కచ్చితంగా ఆ పాత్రకు నిన్నే తీసుకునే వాడిని అని చెప్పారు.
ఇక రాధే శ్యామ్ సినిమా ను ముందుగానే చూసి జక్కన్న ఎడిటింగ్ లో సలహాలు కూడా ఇచ్చారట ఇదంతా డార్లింగ్ కోసమే గా మరీ. అయినా రాజమౌళి హీరో కాంబినేషన్ ను నమ్మాడు అని ఆయన సినిమాలతోనే అర్థమవుతుంది. ఏ సినిమాకు ఏ హీరోయిన్ అవసరమో ఆ హీరోనే రాజమౌళి ఎంచుకుంటారు. కేవలం హిట్ కాంబినేషన్ హిట్ పెయిర్ తో సినిమా లు తీయరు కాబట్టే ఆయన ఎంత వరకు తన సినిమా ల పరాజయం చూడలేదు.