మరో ప్రైడ్ మూమెంట్ తో హాలీవుడ్ లో మోగుతున్న రాజమౌళి పేరు.!

ప్రస్తుతం ఇండియన్ సినిమా దగ్గర నెంబర్ 1 దర్శకుడు ఎవరన్నా ఉన్నారు అంటే అది మన తెలుగు డైరెక్టర్ ఎస్ ఎస్ రాజమౌళినే అని చెప్పడంలో మన తెలుగు ఆడియెన్స్ కి కూడా ఎంతో గర్వకారణం. తాను చేసిన గత మూడు సినిమాలు అనేక అంశాల్లో ప్రపంచ వ్యాప్తంగా ఆడియెన్స్ ని అలరించగా ఇప్పుడు గ్లోబల్ ఆడియెన్స్ రాజమౌళి వర్క్ కి దాసోహం అవుతున్నారు.

ఇక ఇప్పుడు అయితే రాజమౌళి చేసిన ట్రిపుల్ ఆర్(RRR) సక్సెస్ ని ఇంకా ఎంజాయ్ చేస్తుండడం విశేషం కాగా అందులోని ఫారిన్ ఆడియెన్స్ కి ఈ సినిమాకి ఇంకా ప్రత్యేకంగా షో లు పడుతూ భారీ రెస్పాన్స్ నమోదు అవుతుండడంతో హాలీవుడ్ లో కూడా రాజమౌళి పేరు ఆసక్తిగా మారింది.

ఇక ఈ భారీ సక్సెస్ తో ఇంకా అమెరికా లోనే రాజమౌళి ఉండగా అక్కడ పేరుమోసిన వేడుకలకి గాను రాజమౌళికి ఆహ్వానం అందుతూ ఉండడం మన తెలుగు వారికి కూడా గర్వ కారణంగా నిలిచింది. అలాగే సినిమా ఆస్కార్స్ వరకు వెళ్లడం ఇప్పటికీ ఛాన్స్ ఉండడంతో పలు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఇప్పుడు అయితే హాలీవుడ్ గవర్నర్స్ అవార్డ్స్ వేడుకలో రాజమౌళి పాల్గొన్నారు. దీనితో ఇప్పుడు హాలీవుడ్ మీడియాలో రాజమౌళి పేరు మారుమోగుతోంది.