Rajamouli: రజనీ, కమల్ కాంబినేషన్లో రాజమౌళి సినిమా… ఎప్పుడంటే …?

Rajamouli: కొందరు హీరోయిన్లు ప్రత్యేకించి కొందరు హీరోస్ తో కలిసి నటించాలని అనుకుంటారు. మరి కొందరు నటులు మాత్రం కొందరి డైరెక్షన్ లో వర్క్ చేయాలని ఆశిస్తారు. అలాంటి వాళ్లలో ప్రస్తుతం ముందున్న డైరెక్టర్ రాజమౌళి. బాహుబలి లాంటి భారీ విజయాన్ని తెలుగు ఇండస్ట్రీకి అందించి, టాలీవుడ్ స్థాయిని ఎక్కడికో తీసుకెళ్లిన ఘనత కచ్చితంగా రాజమౌళికే చెందుతుందని ఇప్పటికీ పలువురు సినీ పెద్దలు భావిస్తారు. అలాంటి డైనమిక్ డైరెక్టర్ డైరెక్షన్ లో నటించే అవకాశం వస్తే ఎవరు మాత్రం కాదంటారు.

పెద్ద పెద్ద స్టార్స్ సైతం ఆయన తీయబోయే సినిమాలో అవకాశం కోసం ఎదురుచూస్తారు అనడంలో ఏ మాత్రం సందేహం లేదు. కాగా ఇటీవల ఆ అవకాశాన్ని యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లు దక్కించుకున్నారు. భారీ బడ్జెట్ లో తెరకెక్కిన ఈ చిత్రంలో వీరిద్దరూ ప్రధాన పాత్రల్లో నటించారు. అదే ఆర్ ఆర్ ఆర్. తాజాగా విడుదలైన ఈ సినిమాకి భారీ స్పందన వస్తుంది. ఏ రకంగా చూసినా ఈ సినిమా అదుర్స్ అంటూ ఇప్పటికే ఫ్యాన్స్ సంబరాలు జరుపుకుంటున్నారు.

ఇకపోతే నెక్స్ట్ జక్కన్న ఏ హీరోతో ఎలాంటి సినిమా తీస్తాడో అన్న టాక్ అప్పుడే మొదలైనట్టు తెలుస్తోంది. ఐతే ఆ విషయంపై స్పందించిన ఆయన, రజనీ కాంత్, కమల్ హాసన్ లతో ఎప్పటి నుంచో ఓ సినిమా చేయాలని అనుకుంటున్నట్టు రాజమౌళి తన మనసులోని మాటను బయట పెట్టారు. దాని కోసం కథ ఐతే ఏమీ అనుకోలేదు కానీ, వారిద్దరిలో ఒకరు హీరో, మరొకరు విలన్ ఐతే బాగుంటుందని మాత్రం అనుకుంటున్నట్టు ఆయన చెప్పారు. ఆ ఇద్దరు హీరోస్ మామూలుగా వేరు వేరుగా సినిమాల్లో నటిస్తేనే అభిమానులు చేసే హడావిడి అంతా ఇంతా ఉండదు. అలాంటిది వాళ్ళిద్దరూ కలిసి ఒకే మూవీలో నటిస్తే, సంచలనమే అని కొందరు అభిప్రాయ పడుతున్నారు. కెరీర్ ప్రారంభంలో వారిద్దరూ కలిసి నటించినా, రీసెంట్ గా ఐతే అలాంటి సినిమాలే రాలేదు. ఐనా మన జక్కన్న తల్చుకుంటే ఎంత పని అది అని ఫ్యాన్స్ విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.