వైరల్ : మహేష్ సినిమాపై కీలక డీటెయిల్స్ చెప్పిన జక్కన్న.!

ప్రస్తుతం పాన్ ఇండియా సినిమా లోనే కాకుండా వరల్డ్ వైడ్ సినిమా దగ్గర కూడా భారీ ఎత్తున హైప్ ఉన్న ప్రాజెక్ట్ లలో సెన్సేషన్ చిత్రం మహేష్ బాబు మరియు రాజమౌళి లది కూడా ఒకటి. మరి ఈ చిత్రం మహేష్ బాబు కెరీర్ లో 29వ సినిమాగా తెరకెక్కనుండగా ఈ చిత్రం ఎప్పుడు స్టార్ట్ కానుంది అనే ఇతర అంశాలు సస్పెన్స్ గా నిలిచాయి.

అయితే తన గత చిత్రం ఆర్ ఆర్ ఆర్ సక్సెస్ తో ప్రపంచ వ్యాప్తంగా రాజమౌళి కి మంచి ఫేమ్ రాగా నెక్స్ట్ తన నుంచి ఏ సినిమా ఉంటుంది అనేది కూడా వరల్డ్ సినిమా దగ్గర ఆసక్తిగా మారింది. మరి దీనిపై లేటెస్ట్ గా ఓ ఇంటర్నేషనల్ మీడియా తో మాట్లాడుతూ మరికొన్ని కీలక డీటెయిల్స్ అయితే తాను రివీల్ చేయడం ఇండస్ట్రీ వర్గాల్లో వైరల్ గా మారిపోయింది.

మరి తాను మాట్లాడుతూ తాను నెక్స్ట్ ప్రాజెక్ట్ గా మహేష్ బాబు తో ఓ గ్లోబల్ సినిమా చేస్తున్నానని తెలిపారు. అలాగే ఈ చిత్రం కోసం తాను ఓ హాలీవుడ్ ప్రముఖ టీం ని హైర్ చేసుకోగా వారితో సినిమా ఎలా ఉండాలి అనే అంశాలపై చర్చిస్తున్నానని వారి నుంచి ఐడియాలు తీసుకుంటున్నానని.

వారు వరల్డ్ వైడ్ సినిమా దగ్గర మంచి పట్టు ఉన్న వాళ్ళు కాగా ఈ సినిమా కోసం వారితో వర్క్ చేస్తున్నట్టు జక్కన్న తెలిపాడు. ఇక మరిన్ని మాటలు జోడిస్తూ ఈ చిత్రం మహేష్ తో పదేళ్ల నుంచి పెండింగ్ గా ఉన్న ప్రాజెక్ట్ అని ఫైనల్ గా ఇప్పుడు వరల్డ్ వైడ్ సినిమాగా చేస్తున్నట్టుగా క్లారిటీ ఇచ్చారు.