‘ఆర్‌ఆర్‌ఆర్‌’ రిలీజ్‌ డేట్‌పై రాజమౌళి ఏమన్నారంటే…

సూపర్ డూపర్ ‌హిట్  ‌సినిమాలతో ఇండియన్ టాప్‌ డైరెక్టర్‌గా దూసుకెళ్లారు దర్శకధీరుడు ఎస్‌.ఎస్‌.రాజమౌళి.  ఈ అగ్ర దర్శకుడు ఇప్పుడు మోస్ట్‌ ప్రెస్టీజియస్‌ చిత్రం  ‘ఆర్‌ఆర్‌ఆర్‌’  (రౌద్రం రణం రుధిరం)  సినిమాను తెరకెక్కిస్తున్నారు.

RRR

తెలంగాణ వీరుడు కొమురం భీమ్‌గా యంగ్ టైగర్‌ ఎన్టీఆర్‌, మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజుగా మెగా పవర్‌స్టార్‌ రామ్‌చరణ్ నటిస్తోన్న ఈ చిత్రంలో బాలీవుడ్ తారలు అజయ్‌ దేవగణ్‌, అలియాభట్‌, హాలీవుడ్ స్టార్సు‌ నటిస్తున్నారు. ఈ సినిమాపై ఎప్పటికప్పుడు అంచనాలు హద్దులు దాటిపోతున్నాయి. ఎవరికి ఇష్టం వచ్చిన రీతిలో వారు చర్చించుకుంటున్నారు. ఈ చర్చలు చూస్తూ  దర్శకధీరుడు ఎస్‌.ఎస్‌.రాజమౌళితో సహా యూనిట్ మొత్తం తెగ నవ్వుకుంటుందట.

అయితే ఇటీవల ఓ సందర్భంలో  రాజమౌళి మీడియాతో మాట్లాడారు. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ రిలీజ్‌ ఎప్పుడు ఉండొచ్చు? అని కదిలిస్తే..  కరోనా ముందైతే నేను డేట్‌ చెప్పాను. కానీ ఇప్పుడు అలా చెప్పడం కష్టం. కొన్ని పద్ధతుల్లో షూటింగ్‌ చేయాల్సి ఉంది. అలా చేస్తున్నప్పుడు అనుకున్న సమయంలోనే షూటింగ్‌ చేస్తున్నానా!, అని చూసుకోవాలి. ప్రాక్టికల్‌ సమస్యలేంటో తెలుసుకోవాలి. ఇప్పుడు కంటిన్యూగా రెండు నెలలు షూటింగ్‌ ప్లాన్‌ చేసుకున్నాం. ఆ రెండు నెలలు షూటింగ్‌ అనుకున్నట్లు జరుగుతుందా అని చూసుకోవాలి. తర్వాతే రిలీజ్‌ డేట్‌పై అవగాహన కలుగుతుంది అని చెప్పుకొచ్చారు.