Rajamouli : రాజమౌళి ఇంట్లో ఆర్ఆర్ఆర్ గురించి ఏం మాట్లాడుకుంటున్నారో తెలుసా…!

Rajamouli : ఆర్ఆర్ఆర్ సినిమా దేశమంతా తెలుగు చిత్ర పరిశ్రమ మాట్లాడుకునేలా చేసింది. ఇక జక్కన్న గురించి బాలీవుడ్ మీడియా తెగ మాట్లాడేస్తోంది.ఇక శుక్రవారం సినిమా విడుదలైన రోజు నుండి ఆర్ఆర్ఆర్ గురించే మాట్లాడుతున్నారు. ఇక ఈ చిత్రం రికార్డులను బద్ధలుకొడుతూనే ఉంది.ఇక ప్రపంచ వ్యాప్తంగా రచ్చ చేస్తోంది ఆర్ఆర్ఆర్. ఈ సినిమాలో రామ్ చరణ్, ఎన్టీఆర్ ల నటన ఎంత అద్భుతంగా ఉందొ ఇద్దరిని సమంగా చూపించిన రాజమౌళి పనితీరు అంతే అద్భుతంగా ఉంది.

తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సినిమా విడుదల అయింది కాబట్టి వాట్సాప్ లో తన కుటుంబ గ్రూప్ లో ఈ సినిమా గురించిన డిస్కషన్ మొదలైందని అన్నారు రాజమౌళి. ఆ గ్రూప్లో దగ్గర దగ్గర 41 మంది ఉంటారట. సినిమా విడుదలైన దగ్గర నుంచి టికెట్ల కోసం రిక్వెస్ట్ లేక మూవీ రివ్యూస్ పోస్ట్ చేస్తూ ఉంటారని అన్నారు రాజమౌళి.

అయితే టికెట్లు కావాల్సిన అవసరం అంతగా రాదని ఎందుకంటే తన భార్య రమా రాజమౌళి కుటుంబం మొత్తానికి టికెట్లు మొదటిరోజే ఇస్తారని అన్నారు. ప్రస్తుతం “ఆర్ అర్ ఆర్” గురించి తమ గ్రూప్లో డిస్కషన్ జరుగుతుందట. ఇక ఈ సినిమా విడుదలై బ్లాక్ బస్టర్ అవడంతో రాజమౌళి తన కుటుంబంతో కలిసి ఎక్కడికైనా వెకేషన్ కి వెళ్లాలని తిరిగి వచ్చిన తర్వాత తన తదుపరి సినిమా గురించి ఆలోచించాలని అన్నారు. ఈ నేపథ్యంలో రాజమౌళి ఒక 15 రోజుల పాటు తన కుటుంబంతో యూరోప్ కి వెళ్లబోతున్నట్లు తెలుస్తోంది. ఇక రాజమౌళి తదుపరి సినిమా సూపర్ స్టార్ మహేష్ బాబుతో ఉండబోతోందని తెలిసిందే.