మహేష్ సినిమాతో బిజీగా రాజమౌళి!

‘బాహుబలి’తో పాన్‌ ఇండియాని ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ తో పాన్‌ వరల్డ్‌ ని షేక్‌ చేసిన దర్శధీరుడు రాజమౌళి ‘ట్రిపుల్‌ ఆర్’ తరవాత మహేష్‌ తో సినిమాను ఫిక్స్‌ చేసుకున్న విషయం తెలిసిందే. మహేష్‌ సినిమాకు ఎలా లేదన్నా 3 ఏళ్లు టైం తీసుకునే ఆలోచనలో ఉన్న రాజమౌళి ఆ సినిమా తర్వాత నెక్ట్స్‌ సినిమా ప్లానింగ్‌ ఉంటుందని తెలుస్తుంది. మహేష్‌ తో చేసే సినిమా కూడా రెండు భాగాలుగా ఉంటుందని టాక్‌.

అలా అయితే మరో ఏడాది అంటే నాలుగేళ్ల పాటు రాజమౌళి మహేష్‌ సినిమా ఉంటుంది. ఇక ఆ తర్వాత జక్కన్న తన లిస్ట్‌ లో ఒకరిద్దరి హీరోల పేర్లు ఉంచుకున్నాడు. అందులో ఎన్‌.టి.ఆర్‌, ప్రభాస్‌ లు ఉన్నారు. ఆల్రెడీ ఎన్‌.టి.ఆర్‌ తో సినిమాలు చేసిన రాజమౌళి మరో సినిమా ప్లానింగ్‌ ఉన్నట్టు తెలుస్తుంది. మరో పక్క ప్రభాస్‌ తో కూడా రాజమౌళి సినిమా ఉంటుందని టాక్‌. అయితే లేటెస్ట్‌ గా రాజమౌళి అల్లు అర్జున్‌ తో కూడా సినిమా చేయాలని ఆలోచిస్తున్నాడట. మహేష్‌ సినిమా తర్వాత మాక్సిమం అల్లు అర్జున్‌ తోనే జక్కన్న సినిమా ఉండే ఛాన్స్‌ ఉందట. పుష్ప 1 సినిమాలో తన నటనకు గాను అల్లు అర్జున్‌ నేషనల్‌ బెస్ట్‌ యాక్టర్‌ అవార్డు అందుకున్నాడు. అల్లు అర్జున్‌ ని అభినందించిన రాజమౌళి పుష్ప తగ్గేదేలే కంగ్రాట్స్‌ బన్నీ అని ట్వీట్‌ చేశారు.

అంతకుముందు కూడా అల్లు అర్జున్‌ సినిమాకు పడే కష్టాన్ని గురించి రాజమౌళి ప్రశంసించారు. సో ఈ సమీకరణాలను చూస్తుంటే అల్లు అర్జున్‌ తో రాజమౌళి సినిమా త్వరలోనే ఉండబోతుందని అర్థమవుతుంది. రాజమౌళితో అల్లు అర్జున్‌ కాంబో సినిమా కచ్చితంగా వెరైటీ కంటెంట్‌ టార్గెట్‌ టూ ఆస్కార్‌ అని చెప్పొచ్చు. తన ప్రతి సినిమాలో తన ప్రతి పాత్రతో తెలుగు ఆడియన్స్‌ ని ఫ్యాన్స్‌ ని మెప్పిస్తూ వస్తున్న అల్లు అర్జున్‌.. తన ప్రతి సినిమాతో తన ప్రతి స్టెప్‌ తో తెలుగు సినిమా స్థాయిని పెంచుతూ వస్తున్న రాజమౌళి ఇలా ఈ ఇద్దరు కలిసి సినిమా చేస్తే మాత్రం రికార్డులన్నీ సైడ్‌ అయిపోవాల్సిందే.

తప్పకుండా ఈ కాంబో సెట్‌ అయ్యి తెలుగు సినిమా స్టామినా మరోసారి ఇంటర్నేషనల్‌ లెవెల్‌ లో రీ సౌండ్‌ వినిపించాలని ఆడియన్స్‌ కోరుతున్నారు. మహేష్‌ తర్వాత అల్లు అర్జున్‌ ఆ తర్వాత తారక్‌, ప్రభాస్‌ రాజమౌళి సినిమాల ఎª`లానింగ్‌ తో ఆడియన్స్‌ మైండ్‌ బ్లాక్‌ అయ్యేలా చేస్తుంది..