RRR OTT : ఆర్ఆర్ఆర్ ఓటీటీ కి డిలీట్ చేసిన సన్నివేశాలు…. అభిమానులు వెయిటింగ్…!

RRR OTT : ఆర్ఆర్ఆర్ సినిమా విడుదలవ్వకముందు హిట్ అవుతుంది అని మాత్రమే అనుకున్నారు. కానీ విడుదలయ్యాక సినిమా థియేటర్లలో రచ్చ చేస్తోంది. ఎక్కడ ఈ సినిమా లో ఎన్టీఆర్ , రామ్ చరణ్ ల మధ్య సాగే సన్నివేశాలకు జనం ఫిదా అవుతున్నారు. ఒకరిని మించి ఒకరు పోటీపడి నటించారు. ఇక వారి కెరీర్ లోనే బెస్ట్ పెర్ఫార్మన్స్ ను ఇచ్చారు ఇద్దరు ఇక వీళ్లిద్దరి తర్వాత చెప్పుకోదగ్గ పాత్రలు మల్లి, అజయ్ దేవగన్, మరియు ఆలియా భట్.

ఇక ఆలియా భట్ పాత్ర నిడివి సినిమాలో తక్కువ ఉండటం ఒకింత అసంతృప్తి కి కారణమైన సీఐ ఏమైంది లెన్త్ ఎక్కువ అవడంతో కట్ చేయక తప్పలేదట డైరెక్టర్ కి.ఇక ఇపుడు సినిమా ను ఓటీటీ లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. కానీ ఇక్కడ ఒక సర్ ప్రైజ్ ఇవ్వబోతున్నాడు రాజమౌళి అభిమానులకు.

సినిమాలో నిడివి ఎక్కువ అవడంతో తొలగించిన సన్నివేశాలను ఓటీటీ లో విడుదలచేయాలని భావిస్తున్నారట జక్కన్న. మల్లి,ఎన్టీఆర్ ల మధ్య ఉన్న సన్నివేశాలను అలాగే రామ్ చరణ్ ఆలియా ల మధ్య ఉన్న సన్నివేశాలను ఓటీటీ లో విడుదల చేస్తారని ప్రచారం జరుగుతోంది. అదేగనక జరిగితే మల్లి ఓటీటీ లో కూడా ఆర్ఆర్ఆర్ రికార్డుల మోత మొగిస్తుందనడం లో ఏమి సందేహం లేదు.