మారుతి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా నటిస్తున్న చిత్రం ది రాజా సాబ్ వచ్చే సంవత్సరం ఏప్రిల్ 10 న విడుదల కానుంది అని ఎప్పుడో డేట్ లాక్ చేసేసారు. అయితే ఈమధ్య ఈ సినిమా పోస్ట్ పోన్ అవ్వబోతుంది అన్న రూమర్స్ వచ్చి ప్రభాస్ ప్రేక్షకులను ఆందోళనకు గురి చేస్తున్నాయి. టీజర్ కట్ ను విడుదల చేసిన పీపుల్స్ మీడియా కూడా ఈ పోస్ట్ పోన్ గురించి క్లారిటీ ఏం ఇవ్వకపోవడంతో అందరూ అయోమయంలో ఉన్నారు.
సాహో సినిమా నుంచి ఇప్పటివరకు విడుదలైన ప్రభాస్ ప్రతి సినిమా వాయిదా అవుతూనే వస్తుంది ఇది కూడా వాయిదా అవుతుంది ఏమో అని అందరూ ఆందోళన పడుతున్నారు. ఇదిలా ఉండగా ట్విట్టర్లో సినిమా కథానాయక మాళవిక మోహన్ మాత్రం నా తెలుగు డెబ్యూట్ ఏప్రిల్ లో కానుంది అని చెప్పుకొచ్చింది. కావాలనే అలా చెప్పిందో లేకపోతే తనకి పోస్ట్ పోన్ గురించి ఇన్ఫర్మేషన్ తెలియక ఇలా చెప్పిందో తెలీదు కానీ ఇప్పుడు అందర్నీ కన్ఫ్యూజన్లో పడేసింది.
సినిమా షూటింగ్ అయితే ఇంకా పూర్తి కాలేదు ప్రస్తుతానికి ప్రభాస్ ఇంజూరీతోs రెస్ట్ తీసుకుంటున్నారు. మళ్ళీ జనవరిలో ఈ షూట్లో పాలుపంచుకోబోతున్నారు దీనివల్ల సినిమా షూటింగ్ లేట్ అయ్యే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా సిద్దు జొన్నలగడ్డ బొమ్మరిల్లు భాస్కర్ కాంబోలో వస్తున్న సినిమానీ ఏప్రిల్ 10న విడుదల చేస్తున్నట్టు అఫీషియల్ గా పోస్టర్ రిలీజ్ చేశారు.
ప్రభాస్ సినిమాతో పోటీగా సిద్దు సినిమా విడుదల చేయడు కదా అంటూ కొన్ని మంది ఆలోచిస్తున్నారు. పోనీ ఇవన్నీ కాదు మే 9 నెల విడుదల చేద్దాం అంటే ఎప్పటినుంచో ఆ డేట్ మీద కర్చీఫ్ వేసేసారు మాస్ మహారాజా. సో మే 9న కూడా సినిమా విడుదల అయ్యే అవకాశం లేదు. మరి ఈ కన్ఫ్యూజన్లన్నీ పోవాలంటే చిత్ర బృందం ఒక స్పందన ఇవ్వాల్సిందే.