Home News ప్లేటు ఫిరాయించిన రాహుల్ సిప్లిగంజ్.. అనూహ్యంగా ఆమెకు మద్దతు

ప్లేటు ఫిరాయించిన రాహుల్ సిప్లిగంజ్.. అనూహ్యంగా ఆమెకు మద్దతు

రాహుల్ సిప్లిగంజ్..ఎప్పుడూ ఇతడి పేరు వార్తల్లో నానుతూనే ఉంటుంది. డ్రంక్ డ్రైవ్ లో దొరికి ఒకసారి, పబ్ లో గొడవతో మరోసారి, బిగ్ బాస్ విన్నర్ గా గెలిచి మరోసారి రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అయ్యాడు రాహుల్. బిగ్ బాస్‌ సీజన్ 3 జరుగుతోన్న సమయంలో.. కో కంటెస్టెంట్ పునర్నవి భూపాలంతో ట్రాక్ నడిపి అలా కూడా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయ్యాడు. ముద్దులు, హగ్గులతో ఓ రేంజ్ లో రెచ్చిపోయాడు. ఆ రకంగా జనాల్లో తన రేంజ్ పెంచుకున్నాడు.

Rahul Vote | Telugu Rajyam

ప్రస్తుతం ఇతగాడి కెరీర్ జెట్ స్పీడులో దూసుకుపోతుంది. సింగర్, యాక్టర్‌గా, హోస్ట్ గా అదరగొడుతున్నాడు. ప్రజంట్ బిగ్ బాస్ నాలుగో సీజన్ నడుస్తోన్న సమయంలో, బిగ్ బాస్ బజ్ పేరుతో ఎలిమినేట్ అయిన సభ్యులను ఇంటర్వ్యూ చేస్తున్నాడు రాహుల్. ఈ క్రమంలో తాజాగా అతడు తాజా సీజన్ లో మద్దతిచ్చే కంటెస్టెంట్ విషయంలో యూ టర్న్ తీసుకున్నాడు. నిన్న మొన్నటి వరకూ ఒకరికి సపోర్ట్ చేసిన రాహుల్.. ప్రస్తుతం ఓ లేడీ కంటెస్టెంట్‌కు జై కొట్టాడు.

రాహుల్ సిప్లీగంజ్‌ను బిగ్ బాస్ విన్నర్ అవ్వడంలో సింగర్ కమ్ యాక్టర్ నోయల్ బయటనుంచి కీ రోల్ పోషించాడు. ఇక, నాలుగో సీజన్‌లో నోయల్ కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇవ్వడంతో రాహుల్ రుణం తీర్చుకోవాలని భావించాడు. నోయల్‌కు మద్దతు తెలపడంతో పాటు అతడికి బయట మంచి బజ్ క్రియేట్ చేశాడు. కానీ, నోయల్ అనారోగ్యం కారణంగా షో నుంచి ఆకస్మాత్తుగా బయటకు వచ్చాడు. దీంతో అభిజీత్‌కు సపోర్ట్ చేయడం ప్రారంభించాడు రాహుల్. బిగ్ బాస్ విజేత అభిజీత్‌ అవుతాడంటూ చెప్పుకొచ్చాడు. అతడు నామినేట్ అయిన ప్రతి వీక్ ఓట్లు వేసి, అందుకు సంబంధించిన స్క్రీన్ షాట్స్ సోషల్ మీడియాలో షేర్ చేసేవాడు. ఆ తర్వాత ఒకానొక టైమ్ లో సోహెల్‌కు కూడా మద్దతుగా నిలిచాడు . ఇక, ఈ సీజన్ లో కంటెస్టెంట్‌గా ఉన్న మోనాల్‌ ఆటతీరును గతంలో విమర్శించిన రాహుల్.. ఇప్పుడామె విషయంలో ప్లేటు ఫిరాయించాడు.

ఈ వారం నామినేషన్స్ లో ఉన్న మోనాల్‌కు బహిరంగంగా మద్దతు ప్రకటించాడు. ఆమె ఓట్లు పొందేందుకు అర్హురాలు అని పేర్కొన్నాడడు. ఈ మేరకు తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ‘నా ఒపినియన్ ప్రకారం ఈ వారం నామినేట్ అయిన కంటెస్టెంట్లలో మోనాల్‌ గజ్జర్‌కు సేవ్ అయ్యే అర్హత ఉంది. కాబట్టి అందరూ ఆమెకు ఓట్ చేయండి’ అంటూ రాసుకొచ్చాడు.

- Advertisement -

Related Posts

రోబో దర్శకుడితో చరణ్, పవన్.. వామ్మో.. ఇదెక్కడి కాంబో!

ఒక మల్టీస్టారర్ సినిమా సెట్స్ పైకి వచ్చే వరకు ఒకప్పుడు అభిమానులు నమ్మేవారు కాదు. అయితే చాలా కాలం తరువాత అగ్ర హీరోలు ఈగోలను పక్కనపెట్టే సినిమాలను వెండితెరపైకి తీసుకు వస్తున్నారు. ఇక...

స్టార్ హీరో పెళ్లి వేడుక.. మాజీ లవ్ బర్డ్స్ కు స్పెషల్ ఇన్విటేషన్

బాలీవుడ్ లో త్వరలో ఒక యువ హీరో పెళ్లి చేసుకోబోతున్న విషయం తెలిసిందే. బ్యాక్ టూ బ్యాక్ కమర్షియల్ హిందీ సినిమాలతో బాక్సాఫీస్ వద్ద సాలీడ్ హిట్స్ అందుకుంటున్న వరుణ్ ధావన్ త్వరలో...

నేను చస్తే వాటికి ఆహారం అవుతాను.. కమెడియన్ వింత కోరిక

సాధారణంగా ఎవరైనా సరే చనిపోతే అవయవదానం చేయడానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తారు. మరికొందరు ఉన్నతమైన వారు తన శరీరం జూనియర్ డాక్టర్స్ కు ఉపయోగపడాలని ఏకంగా బాడీని మెడికల్ కాలేజ్ కోర్సుల కోసం...

డిజాస్టర్ టాక్ వచ్చినా డోస్ తగ్గలేదు.. మాస్టర్ కు అప్పుడే అన్ని కోట్లా?

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ ఎలాంటి సినిమా చేసినా కూడా బాక్సాఫీస్ వద్ద మినిమమ్ 100కోట్లకు తక్కువగా రాబట్టవు. కథలో మ్యాటర్ లేకపోయినా కూడా విజయ్ క్యారెక్టర్ ను సరిగ్గా ఎలివేట్ చేస్తే...

Latest News