మాట మార్చేసిన రాహుల్ సిప్లిగంజ్…బిగ్ బాస్ కంటెస్టెంట్స్‌ మీద షాకింగ్ పోస్ట్!

rahul sipligunj changed his view on bigg boss season 4 winner

బిగ్ బాస్ సీజన్ 3 విజేత అయిన రాహుల్ సిప్లిగంజ్,ఈ సీజన్‌లో బిగ్ బాస్ హౌస్ నుండి ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్‌తో ఇంటర్వ్యూలు చేస్తూ ఒక షో చేస్తున్నాడు. ఇలా బిగ్ బాస్ సీజన్ 4ని బాగా ఫాలో అవుతున్న రాహుల్ సిప్లిగంజ్… రీసెంట్‌గా ఒక ప్రముఖ ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో… ‘నా ఫేవరెట్ కంటెస్టెంట్ అంటే మా అన్న నోయల్, ఆయన ఎలాగూ బయటకు వచ్చేశాడు కాబట్టి ఉన్న వాళ్లలో అభిజిత్ నా ఫేవరేట్. సొహైల్, అరియానా ఇలా ఇద్దరు ముగ్గురు నా ఫేవరెట్ కంటెస్టెంట్స్‌గా ఉన్నారు. వాళ్లకు నా సపోర్ట్ తప్పకుండా ఉంటుంది. అయితే వీళ్లలో విన్నర్ ఎవరంటే మాత్రం అభిజిత్ కావొచ్చు అనిపిస్తుంది అంటూ జోస్యం చెప్పాడు రాహుల్ సిప్లిగంజ్.

rahul sipligunj changed his view on bigg boss season 4 winner
rahul sipligunj

కానీ కొద్దిసేపటి క్రితం రాహుల్ సిప్లిగంజ్ తన ఇన్ స్టాగ్రామ్ స్టోరీలో షాకింగ్ పోస్ట్ షేర్ చేశాడు. ‘సొహైల్, అరియానాలకే తన మద్దతు అని ప్రకటిస్తూ.. పెర్ఫామెన్స్‌ని బట్టే మన సపోర్ట్ ఉంటుంది.. ఎవరు చెప్పినా నమ్మకండి.. బాగా ఆడేవాళ్లని, జన్యూన్‌గా ఆడేవాళ్లని సపోర్ట్ చేయండి.. నాకు సొహైల్, అరియానాలను టాప్ 2లో చూడాలని ఉంది. దమ్ము ఉంటే సపోర్ట్.. పనికిరానోళ్లని బయటకు తొయ్యండి’ అంటూ షాకింగ్ పోస్ట్ పెట్టాడు సొహైల్.

అయితే ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పాటు ఓ రేంజ్‌లో ట్రోల్ అవుతోంది. జన్యునిటీ గురించి నువ్ మాట్లాడుతున్నావా?? గత సీజన్‌లో నువ్ ఎలా గెలిచావో.. ఏం గేమ్ ఆడావో మాకు తెలియదా? అని ట్రోల్ చేస్తున్నారు.నిన్నటి వరకూ అభిజిత్ విన్నర్ అవుతాడని చెప్పిన రాహుల్ , ఇప్పుడు సొహైల్, అరియానాలు టాప్‌లో ఉండాలని అనడమే కాకుండా పనికిరాని వాళ్లని భయటకు తోసేయండి అని అనడంతో అభిజిత్ ఫ్యాన్స్‌తో పాటు మిగిలిన కంటెస్టెంట్స్ ఫ్యాన్స్ హర్ట్ అవుతున్నారు. సొహైల్, అరియానా ఫ్యాన్స్ రాహుల్ పోస్ట్‌కి జై కొడుతుంటే.. మిగిలిన కంటెస్టెంట్స్ ఫ్యాన్స్ ఫైర్ అవుతూ దారుణంగా ట్రోల్ చేస్తున్నారు.