శ్రీముఖితో అలాంటి బంధం.. రాహుల్ కామెంట్స్ వైరల్

Rahul Sipligunj ABout Sreemukhi

బిగ్ బాస్ షోకు వెళ్లకముందు రాహుల్ శ్రీముఖి మంచి స్నేహితులు. కానీ బిగ్ బాస్ షో ఈ ఇద్దరి మధ్య దూరం పెంచింది. ఈ ఇద్దరూ ఇంట్లో ఉన్న సమయంలో బద్ద శత్రువులుగా మారారు. శ్రీముఖి శత్రుత్వమే రాహుల్‌ను విజేతగా నిలబెట్టింది. అయితే బయటకు వచ్చాక కూడా రాహుల్ శ్రీముఖి ఎడమొహం పెడమొహంగానే ఉంటున్నారు. బిగ్ బాస్ మూడో సీజన్ కంటెస్టెంట్లు ఎన్ని పార్టీలు చేసుకున్నా కూడా శ్రీముఖి మాత్రం హాజరు కాదు.

Rahul Sipligunj ABout Sreemukhi
Rahul Sipligunj ABout Sreemukhi

తాజాగా శ్రీముఖితో ఉన్న రిలేషన్ గురించి రాహుల్ నోరు విప్పాడు. శ్రీముఖిని నేను వదిలేయలేదు. ప్రొఫెషనల్ పరంగా ఇద్దరం కలిసే ఉన్నాం.. రీసెంట్‌గా ఇద్దరం కలిసి ఒక ప్రోగ్రామ్ చేశాం. మా మధ్య మంచి రిలేషన్ ఉంది.. గొడవలేం లేవు. బిగ్ బాస్ హౌస్‌లో గొడవలు.. ప్రేమలు ఎక్కువ కాలం ఉండవని సెన్సేషనల్ కామెంట్స్ చేశాడు. అంతే కాకుండా ఒకవేళ అక్కడ మొదలైన ప్రేమ పెళ్లి వరకు వెళ్లినా కాపురం నిలబడదని చెప్పేశాడు.

తన లైఫ్‌లో ప్రేమకథలు చాలా ఉన్నాయని రాహుల్ చెప్పుకొచ్చాడు. తన దృష్టిలో ప్రేమకథ అంటే మనిషిని మనిషి ప్రేమించడం.. వేరే ప్రేమకథలైతే ఎవరూ లేరని నిర్మోహమాటంగా చెప్పుకొచ్చాడు. పునర్నవి, అషూ వీరంతా స్నేహితులే. బయట వాళ్లు ఏదేదో అనుకుంటున్నారని అసలు సంగతులు బయటపెట్టాడు. మొత్తానికి రాహుల్ మాత్రం ఏదో ఒక విషయంలో నిత్యం ట్రెండ్ అవుతూనే ఉంటాడు.