పునర్నవి రాహుల్ జంటకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బిగ్ బాస్ మూడో సీజన్ అంతగా పాపులర్ అవ్వడానికి ఈ జంట కూడా ఓ కారణం. ఆ ఇద్దరూ ఇంతగా ఫేమస్ అవ్వడానికి వారిద్దరూ నడిపిన రహస్య బంధం కారణం. ఈ ఇద్దరూ తమ మధ్య ఉన్నది స్నేహమేనని ఎన్నిసార్లు క్లారిటీ ఇచ్చినా జనం మాత్రం వారిని వేరేలా చూసేవారు. ఇద్దరూ పెళ్లి చేసుకోండి, చేసుకుంటే బాగుంటుందని, చేసుకోవాలని ఫ్యాన్స్ కోరారు.
బిగ్ బాస్ విజేతగా బయటకు వచ్చిన రాహుల్‌కు పునర్నవికి సంబంధించిన ప్రశ్నలే ఎదురయ్యాయి. అయితే ఎన్నిసార్లు ప్రశ్నించినా సరే తాము మంచి దోస్తులమని మాత్రమే చెప్పేవాడు. కానీ మీడియాలో మాత్రం వీరిద్దరికి పెళ్లి జరగబోతోందని వార్తలు వచ్చేవి. ఇంట్లో వాళ్లు కూడా ఒప్పుకున్నారని రాసేవారు. కానీ ఈ ఇద్దరూ మాత్రం ఏనాడు అలాంటి స్టేట్మెంట్స్ ఇవ్వలేదు. ఇక పెళ్లి గురించి, తమ మధ్య ఉన్న రిలేషన్ గురించి నిత్యం అడుగుతూ ఉంటే పున్ను, రాహుల్ అసహనం వ్యక్తం చేసేవారు.
అయితే పునర్నవి తనకు ఎంగేజ్మెంట్ అయిందని ఓ రింగు పెట్టుకున్న ఫోటోను షేర్ చేసింది. పైగా తనకు కాబోయే భర్తను చేతిని పట్టుకున్నట్టు ఓ ఫోటోను షర్ చేసింది. అందులో ఆ చేయి మరీ తెల్లగా ఉండటంతో అది కూడా ఆడవారి చేయేనని, అసలు పున్నుకు ఎంగేజ్మెంట్ కాలేదని, ఏదో జరుగుతోందని కొందరు కామెంట్లు చేస్తున్నారు. ఏది ఏమైనా రాహుల్ తాజాగా స్పందించిన తీరు చూస్తుంటే.. అది పునర్నవి ఎంగేజ్మెంట్ గురించేనని తెలుస్తోంది. నా భయాల వల్ల నేను మోసపోయాన.. నా అనుమానాలన్నీ పటాపంచలయ్యాయి.. నా నమ్మకంతోనే ఎంగేజ్డ్ అయ్యాను.. ఇక నా కలలను పెళ్లి చేసుకున్నాను అంటూ విరహవేదనను అనుభవిస్తున్నట్టు తెలిపాడు.