రాహుల్ సిప్లిగంజ్ ఇప్పుడు ఫుల్ బిజీగా ఉన్నాడు. తన ఊకో కాక మెన్స్ వేర్ స్టోర్‌లను ప్రారంభించే పనిలో ఉన్నాడు. ఇప్పటికే రెండు స్టోర్‌లను విజయవంతంగా ప్రారంభించాడు. తన ఫ్రెండ్ శ్రీకాంత్ అనే వ్యక్తితో కలిసి ప్రారంభించిన ఈ వ్యాపారంలో సక్సెస్ అయ్యారు. కరీంనగర్, హైద్రాబాద్‌లో ఇప్పటికే రెండు స్టోర్‌లను ప్రారంభించేశాడు. ఇక మూడో స్టోర్‌ను కూడా ఓపెన్ చేసేందుకు రెడీ అయ్యాడు. ఈ జోరు చూసి అందరూ ఫిదా అవుతున్నారు. మొత్తానికి రాహుల్ సిప్లిగంజ్, ఊకో కాక ప్రస్తుతం ఫుల్ ట్రెండింగ్‌లో ఉన్నాయి.
ఊకో కాక అనే పేరు ఇప్పుడు విపరీతంగా వైరల్ అవుతోంది. అసలే ఇది తెలంగాణలో ఊత పదం. పైగా ఇలా బ్రాండెండ్ మెన్స్ వేర్ స్టోర్‌లకు ఊకో కాక అని పెట్టడంతో మరింత క్రేజ్ వచ్చింది. అయితే ఈ ఊకో కాకపై అనేక రకాల సోషల్ మీడియాలో ఖాతాలు ఏర్పడ్డాయి. ఊకో కాక పేరిటి నకిలీ ఖాతాలు ప్రారంభమయ్యాయి. దాంట్లో అనేక రకాల డిస్కౌంట్లు ఇస్తూ ఫేక్ పోస్ట్‌లు చేశారు. దీనిపై రాహుల్ సిప్లిగంజ్ ఫైర్ అయ్యాడు. అవన్నీ ఫేక్.. ఊకో కాక అనే పేరు మీద సోషల్ మీడియా ఖాతాను ఓపెన్ చేస్తే తానే ప్రకటిస్తానని చెప్పాడు.
అలా చెప్పినట్టుగానే ఊకో కాక పేరు మీద సోషల్ మీడియా ఖాతా ప్రారంభించాడు. అప్పుడే ఫాలోవర్ల సంఖ్య పది వేలకు కూడా దాటింది. 24 గంటల్లో దాదాపు పన్నెండు వేల మంది ఫాలోవర్లు వచ్చారు. ఇక మూడో స్టోర్ ప్రారంభోత్సవానికి కూడా అన్నీ సిద్దమైనట్టు కనిపిస్తోంది. షాద్ నగర్ దగ్గర్లో పరిగి రోడ్‌లో ఊకో కాక మూడో స్టోర్ ప్రారంభం కాబోతోందట. ఇదే విషయాన్ని చెబుతూ.. ఇలా మీకు ముందే ఎలా తెలుస్తుందని రాహుల్ ఆశ్చర్యపోయాడు. అదే రాహుల్, ఊకో కాకలకు ఇప్పుడున్న క్రేజ్ అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.