రాధే శ్యామ్ టీజర్ విడుదల …అందమైన ప్రేమకావ్యానికి ముహూర్తం ఫిక్స్

ప్రభాస్ హీరోగా పూజా హెగ్డే హీరోయిన్ గా నటించిన అందమైన ప్రేమ కావ్యం రాధే శ్యామ్. సాహో తర్వాత ప్రభాస్ చేస్తోన్న రాధే శ్యామ్ సినిమాను రూ. 140 కోట్ల బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ప్రభాస్ సొంత బ్యానర్ గోపీకృష్ణ మూవీస్‌ తో పాటు సొంత సంస్థ లాంటి యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ప్యాన్ ఇండియన్ స్థాయిలోనే ఈ చిత్రం కూడా వస్తుంది. ఆ మధ్య ఈ సినిమాలో ప్రభాస్ లుక్‌ను రిలీజ్ చేయగా.. ఈ సినిమాలో ప్రభాస్ ‘విక్రమాదిత్య’ గా నటిస్తున్నట్టు పోస్టర్‌లో రివీల్ చేసారు. రాధా కృష్ణ ఈ చిత్రాన్ని ఒక అందమైన పెయింటింగ్ లా తెరకెక్కించారని సినిమా మేకర్స్ అంతా చాలా నమ్మకంగా ఉన్నారు.

అయితే మరి ఈ మోస్ట్ అవైటెడ్ సినిమా నుంచి ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న మోస్ట్ అవైటెడ్ అప్డేట్ ఇచ్చింది చిత్రబృందం. ఈ చిత్రం టీజర్ ఈ ప్రేమికుల దినోత్సవం సందర్భంగా విడుదల చేసింది చిత్రబృందం. రాధేశ్యామ్ పూర్తిగా వింటేజ్ లవ్ స్టోరీగా తెరకెక్కినట్లు తెలుస్తోంది. లవర్స్ డే సందర్భంగా ఈ చిత్రం నుంచి మేకర్స్ 52 సెకండ్లు నిడివి గల గ్లింప్స్ టీజర్‌ను విడుదల చేశారు. ఈ టీజర్ చాలా బ్యూటిఫుల్ గా ఉంది.

అద్భుతమైన విజులవ్స్ తో ఈ టీజర్ అలరిస్తోంది. ఈ టీజర్‌లో ప్రభాస్ ఇటాలియన్ భాషలో కొన్ని డైలాగ్స్ చెప్పడం కొత్తగా ఉంది. ఈ ఏడాది జూలై 30న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్నట్లు ప్రకటించింది. ఈ సినిమాకు తెలుగులో జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందిస్తున్నాడు. జస్టిన్ ప్రభాకరన్ గతేడాది విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ‘డియర్ కామ్రేడ్’ సినిమాకు సంగీతం అందించాడు. రాధేశ్యామ్ తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీలో రాధే శ్యామ్ విడుదల కానుంది. హిందీ ఈ సినిమాకు మిథున్, మనన్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాతో పాటు ఆదిపురుష్ అనే మరో ప్యాన్ ఇండియా సినిమాను చేస్తున్నాడు ప్రభాస్. ఈ సినిమాకు ఓం రౌత్ దర్శకత్వం వహించనున్నాడు. బాలీవుడ్ సూపర్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ మరో కీలక పాత్రలో కనిపించనున్నాడు. ఇక కేజీయఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్‌తో మరో సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే.

Radhe Shyam Telugu Glimpse | Prabhas | Pooja Hegde | Radha Krishna Kumar | Justin Prabhakaran