ఫిబ్రవరి 14న ‘రాధే శ్యామ్’ .. ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ చెప్పిన ప్రభాస్ !

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులకు గుడ్ న్యూస్.. ‘రాధే శ్యామ్’ టీజర్‌‌ తో పాటు విడుదలకు ముహూర్తం ఖరారైందా అంటే ప్రభాస్ సన్నిహిత వర్గాలు అవును అనే సమాధానమే ఇస్తున్నాయి. ప్రస్తుతం తెలుగు సినీ ఇండస్ట్రీతో పాటు అన్ని ఇండస్ట్రీస్‌ లో సినిమా రిలీజ్ డేట్స్‌ల జాతర నడుస్తోంది. ఒక్కొక్కరుగా విడుదల తేదీలు ప్రకటించేసారు. సమ్మర్‌లో రిలీజ్ అయ్యే ఆచార్య నుంచి దసరాకు విడుదలయ్యే ‘ఆర్ఆర్ఆర్’ రిలీజ్ డేట్లు ప్రకటించారు.

Beats Of Radhe Shyam motion poster released
Beats Of Radhe Shyam motion poster released

అలాగే , రీసెంట్‌గా షూటింగ్ మొదలు పెట్టిన ‘సర్కారు వారి పాట’ సినిమా రిలీజ్ డేట్‌ను వచ్చే సంక్రాంతికి ఇపుడు లాక్ చేసేసారు. బాలయ్య, పవన్, వెంకటేష్, అల్లు అర్జున్, రవితేజ, ఒకరా ఇద్దరా అందరూ హీరోలు విడుదల తేదిలు ప్రకటించి అభిమానుల్లో జోష్ నింపారు.దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ కూడా ‘రాధే శ్యామ్’ రిలీజ్ డేట్ ఎపుడు అంటూ సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాలో పూజా హెగ్డేకు సంబంధించిన షూటింగ్ కంప్లీటైంది.

ఫిబ్రవరి మొదటి రెండు వారాల్లో ఈ సినిమాకు గుమ్మడికాయ కొట్టేయనున్నారు. తాజాగా ఈ సినిమా టీజర్‌ను ఫిబ్రవరి 14న రిలీజ్ చేయాలనే ఆలోచనలో ఉన్నారు. ఇప్పటికే ఈ సినిమాలోని ముఖ్యమైన సన్నివేశాలతో టీజర్‌‌ను రెడీ చేసినట్టు సమాచారం. ఈ టీజర్ ఓ రేంజ్‌లో ఉన్నట్టు సమాచారం. ఒకేసారి ఐదు భాషల్లో విడుదల చేయాలి కాబట్టి.. ఫిబ్రవరి 14న టీజర్‌ను విడుదల చేస్తూ.. విడుదల తేదిని కూడా ప్రకటించే ఆలోచనలో ఉన్నారు ’రాధే శ్యామ్’ మూవీ యూనిట్. ముఖ్యంగా బాహుబలి 2 రిలీజ్ డేట్‌ ఏప్రిల్ 28న రిలీజ్ చేయాలనే ఆలోచనలో మూవీ మేకర్స్ ఉన్నారు. దాదాపు అదే డేట్ లాక్ అయ్యే అవకాశాలున్నాయి