తారకరత్న మరణం వెనుక కుట్ర జరిగిందా.. అసలు నిజం ఏంటంటే?

తారకరత్న ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో ఆయన త్వరలోనే కోలుకుంటాడని వార్తలు వినిపించిన సంగతి తెలిసిందే. అయితే తారకరత్న మాత్రం పూర్తిస్థాయిలో కోలుకోలేక మృతి చెందారు. అయితే తారకరత్న మరణం వెనుక కుట్ర ఉందని కొంతమంది అనుమానాలు వ్యక్తం చేశారు. మరి కొందరు మాత్రం తారకరత్న జీవితకాలాన్ని పొడిగించాలని ఇంతకాలం చికిత్స అందించారని కామెంట్లు చేస్తున్నారు.

తారకరత్న ఆరోగ్యం విషయంలో చేసిన నిర్లక్ష్యం వల్లే ఆయన ప్రాణాలు పోయాయని కొంతమంది చెబుతున్నారు. వైద్యుల పర్యవేక్షణ లేకుండా ఆయన చేసిన పొరపాట్లు కెరీర్ పరంగా శాపంగా మారాయని కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తుండటం గమనార్హం. షుగర్ లెవెల్స్ ను కంట్రోల్ లో పెట్టుకుని ఉంటే ఆయనకు ఈ పరిస్థితి వచ్చేది కాదని బోగట్టా. తారకరత్న బ్రెయిన్ డెడ్ వల్ల మృతి చెందినట్టు తెలుస్తోంది.

తారకరత్న వైద్యం కోసం కోట్ల రూపాయల ఖర్చు చేస్తున్నారని తెలుస్తోంది. ఎంట్రీతోనే ప్రపంచ రికార్డ్ సృష్టించారు. ఒకేరోజు 9 సినిమాలను ప్రారంభించిన రికార్డ్ తారకరత్నకు మాత్రమే సొంతమైంది. సాధారణంగా హీరో రోల్స్ లో నటించిన వాళ్లు విలన్ రోల్స్ లో నటించడానికి అస్సలు ఆసక్తి చూపరు. ఎలాంటి రోల్ లో నటించినా తారకరత్న తన పాత్రకు పూర్తిస్థాయిలో న్యాయం చేసేవారు.

బాలయ్య అనిల్ రావిపూడి కాంబో సినిమాలో కీలక పాత్ర కోసం తారకరత్నను సంప్రదించగా ఆరోగ్య సమస్యల వల్ల తారకరత్న ఈ సినిమాలో నటించలేదు. నందమూరి హీరోలు కొంతకాలం పాటు సినిమా షూటింగ్ లకు దూరంగా ఉన్నారు. నందమూరి తారకరత్న మరణంకు సంబంధించి వైద్యుల నుంచి పూర్తిస్థాయిలో క్లారిటీ రావాల్సి ఉంది.