ఫిలింఫేర్ అవార్డులలో ఏడు కేటగిరీలలో అవార్డులను సొంతం చేసుకున్న పుష్ప?

దక్షిణాది చలన చిత్ర పరిశ్రమకు ఎంతో ప్రతిష్టాత్మకంగా అందించే ఫిలింఫేర్ అవార్డుల వేడుక బెంగుళూరులో ఎంతో ఘనంగా జరిగింది. ప్రతి ఏడాది ఎంతో ఘనంగా నిర్వహించే ఈ కార్యక్రమాలు గత రెండు సంవత్సరాలుగా జరగలేదు. కరోనా కారణం వల్ల ఈ అవార్డుల వేడుకను నిర్వహించలేకపోయారు. అయితే ఈ ఏడాది మాత్రం ఈ కార్యక్రమాన్ని ఎంతో ఘనంగా చేసినట్లు తెలుస్తోంది.ఈ క్రమంలోనే ఈ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమంలో భాగంగా సౌత్ సెలబ్రిటీలు అందరూ ఒకే చోట చేరి పెద్ద ఎత్తున సందడి చేశారు.

ఇకపోతే ఈ ఫిలింఫేర్ అవార్డులలో భాగంగా పుష్ప సినిమా మరోసారి తన హవా కొనసాగించింది. ఏకంగా ఏడు కేటగిరీలలో ఫిలింఫేర్ అవార్డులను సొంతం చేసుకొని మరో రికార్డ్ సృష్టించింది. ఈ క్రమంలోనే ఉత్తమ చిత్రం నుంచి మొదలుకొని, ఉత్తమ నటుడు ఉత్తమ సంగీత దర్శకుడు, ఉత్తమ కొరియోగ్రాఫర్, ఉత్తమ గాయకుడు గాయని, ఉత్తమ దర్శకుడు వంటి పలు కేటగిరీలలో ఈ సినిమా ఫిలింఫేర్ అవార్డును సొంతం చేసుకుంది. ఇలా ఫిలింఫేర్ అవార్డులలో కూడా పుష్ప మరోసారి తన హవా కొనసాగించింది.

ఇకపోతే ఈ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమంలో భాగంగా జీవిత సాఫల్య పురస్కారాన్ని కూడా ప్రకటించారు అయితే ఈ ఏడాది ఈ అవార్డును టాలీవుడ్ ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ అందుకున్నారు అదేవిధంగా కన్నడ పవర్ స్టార్ దివంగత నటుడు పునీత్ రాజ్ కుమార్ కి జీవిత సాఫల్య పురస్కారం లభించింది. ఇక పుష్ప సినిమాతో పాటు హాలీవుడ్ చిత్ర పరిశ్రమ నుంచి హీరో సూర్య నటించిన సురారై పోట్రు సినిమాకి గాను ఏకంగా 7 ఫిలింఫేర్ అవార్డులు లభించాయి.