టాలీవుడ్ ఇండస్ట్రీలో టాలెంటెడ్ డైరెక్టర్ గా గుర్తింపు పొందిన సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన పుష్ప సినిమా గతేడాది విడుదలై బ్లాక్ బస్టర్ హిట్టుగా నిలిచిన సంగతి అందరికీ తెలిసిందే. దేశవ్యాప్తంగా అన్ని భాషలలో విడుదల చేసిన ఈ సినిమా ఎక్కడ కూడా తగ్గకుండా రికార్డు స్థాయిలో కలెక్షన్లు కొల్లగొట్టి కొత్త రికార్డులు క్రియేట్ చేసింది. ఇక ఈ సినిమాలో హీరోగా నటించిన అల్లు అర్జున్ తన వైవిధ్యమైన నటనతో ప్రేక్షకులను బాగా కట్టుకున్నాడు. ఈ సినిమాలో అల్లు అర్జున్ నటనకు సినీ విమర్శకుల ప్రశంసలు కూడా దక్కాయి. ముఖ్యంగా బాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ సినిమా ఎవరు ఊహించని విధంగా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.
ఈ సినిమా ఘన విజయం సాధించటంతో ఈ సినిమా సెకండ్ పార్ట్ కోసం ప్రేక్షకులు ఎంతో ఆశ్చర్యతంగా ఎదురుచూస్తున్నారు. దేశవ్యాప్తంగా బ్లాక్ బస్టర్ హిట్ అయిన ఈ సినిమాని ప్రస్తుతం రష్యా భాషలో విడుదల చేయడానికి సినిమా యూనిట్ సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే అల్లు అర్జున్, సుకుమార్ తో సహా సినిమా బృందం రష్యా చేరుకొని అక్కడ సినిమా ప్రమోషన్ పనులు. ఇప్పటికే ఈ సినిమా రష్యా వర్షన్ కి సంబంధించిన ట్రైలర్ సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది.ఇలా రష్యా భాషలో మొట్టమొదటిసారిగా విడుదల చేయబోతున్న సినిమాగా పుష్ప రికార్డ్స్ క్రియేట్ చేసింది. రష్యా చేరుకున్న ఈ సినిమా బృందం సినిమా ప్రమోషన్ పనులలో బిజీగా ఉన్నారు.
ఈ ప్రమోషన్స్ కి సంబంధించిన వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సాధారణంగా ప్రమోషన్స్ కోసం చిత్ర యూనిట్ భారీ స్థాయిలో ఖర్చు చేస్తూ ఉంటుంది. అలాగే ఈ సినిమాని రష్యా భాషలో విడుదల చేయనున్న తరుణంలో అక్కడ ఈ సినిమా ప్రమోషన్స్ కోసం కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు సమాచారం. ఇండస్ట్రీ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం రష్యా లో పుష్ప సినిమా ప్రమోషన్స్ కోసం దాదాపు 5 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. ఈ వార్త తెలిసిన అభిమానులు షాక్ కి గురవుతున్నారు. అంతే కాకుండా ఒక తెలుగు సినిమాని విదేశాల్లో ప్రచారం చేసుకోవడం ముఖ్యమే కానీ దానికోసం ఇలా భారీ మొత్తాన్ని ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదేమోనని ఇండస్ట్రీ వర్గాలలో గుసగుసలు వినిపిస్తున్నాయి.