10 మిలియన్ వసూలు చేసినా “పుష్ప” ప్లాపేనా.!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తర్వాత పాన్ ఇండియా మార్కెట్ లో భారీ క్రేజ్ తెచ్చుకున్న మరో స్టార్ ఎవరన్నా ఉన్నారు అంటే అది ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అనే చెప్పాలి. మరి అల్లు అర్జున్ అయితే హీరోగా నటించిన లాస్ట్ బిగ్గెస్ట్ హిట్ చిత్రం “పుష్ప”. దర్శకుడు సుకుమార్ తెరకెక్కించిన ఈ చిత్రం భారీ హిట్ కాగా అభిమానులు అయితే ఇప్పుడు దీని సీక్వెల్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

మరి ఈ చిత్రం షూటింగ్ ఆల్రెడీ కొంత స్టార్ట్ కాగా పార్ట్ 1 ని అయితే మేకర్స్ గత కొన్ని రోజులు కితమే రష్యా లో రిలీజ్ చేయగా తర్వాత రోజు నుంచి పెద్ద మాటలు కూడా ఈ సినిమా రెస్పాన్స్ లేదు. ఇక ఇప్పుడు లేటెస్ట్ గా సినిమా అక్కడ ఏకంగా 10 మిలియన్ రష్యన్ రుబెల్స్ వసూలు చేసినట్టు మేకర్స్ గొప్పగా చెప్పారు.

కానీ ఈ 10 మిలియన్ అనేది చెప్పుకోడానికి గొప్పగా ఉంటుంది కానీ ఇది అసలు అక్కడ ప్రమోషన్స్ కోసం చిత్ర యూనిట్ పెట్టిన ఖర్చులుకి కూడా సమానం కాదట. అక్కడ 10 మిలియన్ అన్నా మన దగ్గర అది కేవలం 1 కోటి తో సమానం మాత్రమే.

దీనితో మన వాళ్ళు అక్కడ వరకు వెళ్లి ప్రమోషన్స్ చేసి రావడమే 1 కన్నా ఎక్కువ అయ్యి ఉంటుంది. దీనితో అక్కడ 10 మిలియన్ వసూలు చేసినా పుష్ప ప్లాప్ అనే చెప్పాలి. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా రష్మికా హీరోయిన్ గా నటించగా మేకర్స్ ఇప్పుడు నెక్స్ట్ షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నారు.