“పుష్ప 2”..విలన్ సరికొత్త లుక్ కూడా వచ్చేసింది.!

ఇప్పుడు పాన్ ఇండియా సినిమా దగ్గర భారీ చిత్రాల్లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ “పుష్ప 2 ది రూల్” కూడా ఒకటి. మరి ఈ చిత్రాన్ని దర్శకుడు సుకుమార్ తెరకెక్కిస్తుండగా ఈ చిత్రం షూటింగ్ ఇప్పుడు చాలా క్లారిటీగా గ్రాండ్ ఎలిమెంట్స్ తో తెరకెక్కుతుంది.

ఇప్పుడు సుమారు సగానికి షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రంలో హీరో పుష్ప రాజ్ వర్సెస్ అలాగే విలన్ భన్వర్ సింగ్ షెకావత్ మధ్య ఘర్షణ అయితే నెక్స్ట్ లెవెల్లో సుకుమార్ డిజైన్ చేసినట్టుగా టాక్ రాగా ఈ ఇద్దరి మధ్య సన్నివేశాలు మంచి రసవత్తరంగా ఉంటాయి అని సినీ వర్గాల్లో టాక్ ఉంది.

అయితే ఇక ఇది వరకే సినిమా హీరో అల్లు అర్జున్ ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేసిన మేకర్స్ ఇప్పుడు సినిమా విలన్ ఫహద్ ఫాజిల్ నటించిన భన్వర్ సింగ్ షెకావత్ కొత్త లుక్ ని కూడా రివీల్ చేయడం వైరల్ గా మారింది. మరి ఇందులో అయితే షెకావత్ గా ఫహద్ అదే రేంజ్ యాటిట్యూడ్ తో కనిపిస్తుండగా మంచిగా సిగార్ కాలుస్తూ ఓ సూట్ లో తాను అదే గుండు లుక్ లో కనిపిస్తున్నాడు.

దీనితో అయితే విలన్ గా ఫహద్ ఇందులో మరింత స్ట్రాంగ్ గా ఎలివేట్ అయ్యేలా ఉన్నాడని చెప్పాలి. కాగా ఈ చిత్రానికి అయితే దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా రష్మికా మందన్నా హీరోయిన్ గా నటిస్తుంది. అలాగే మైత్రి మూవీ మేకర్స్ మరియు సుకుమార్ లు భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మాణం వహిస్తున్నారు.