బిజినెస్ విషయంలో బన్నీ మొండిపట్టు

ప్రస్తుతం టాలీవుడ్ లో పాన్ ఇండియా సినిమాల హవా నడుస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే తెలుగు సినిమా ఇండస్ట్రీ ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై తన హవాని కొనసాగిస్తుంది. వెయ్యి కోట్లకి పైగా కలెక్షన్స్ సాధించిన రెండు సినిమాలు టాలీవుడ్ నుంచి ఉండటం గొప్ప విషయంగా చెప్పాలి. ఇదిలా ఉంటే ఇప్పుడు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప 2 మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం జరుగుతుంది.

భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాపై అంచనాలు కూడా భారీగానే ఉన్నాయి. ఇప్పటికే పుష్ప మూవీ ఇండియన్ వైడ్ గా సెన్సేషనల్ రికార్డులు క్రియేట్ చేసింది. హిందీలో ఏకంగా వందల కోట్లకి పైగా కలెక్షన్స్ సొంతం చేసుకుంది. ఇప్పుడు దానికి కొనసాగింపుగా పుష్ప 2 మూవీ వస్తున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే ఈ సినిమాతో ఏకంగా వెయ్యి కోట్లకి అల్లు అర్జున్ టార్గెట్ పెట్టాడని టాక్. నిర్మాతతో కూడా ఈ విషయాన్ని చెప్పినట్లు టాక్ వినిపిస్తుంది.

దానికి తగ్గట్లుగానే సినిమాని గ్రాండ్ గా ప్రమోట్ చేయాలని కూడా సుకుమార్, మైత్రీ నిర్మాతలతో కలిసి చర్చిస్తున్నట్లు టాక్ నడుస్తుంది. అయితే ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. దీనికి సంబందించిన అప్డేట్స్ కూడా ఇప్పటి వరకు రాలేదు. ఏప్రిల్ లో బన్నీ పుట్టిన రోజు సందర్భంగా టీజర్ రిలీజ్ చేస్తారని ప్రచారం నడుస్తుంది. అయితే అఫీషియల్ గా మాత్రం దీనిపై ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు.

అలాగే ప్రస్తుతం ఈ మూవీకి ఉన్న బజ్ ప్రకారం చూసుకున్న కూడా బన్నీ టార్గెట్ పెట్టినట్లు వెయ్యి కోట్ల బిజినెస్ జరిగే అవకాశం లేదనే మాట వినిపిస్తుంది. ప్రస్తుతం టక్స్ ప్రకారం 700 కోట్ల వరకు ఈ మూవీ బిజినెస్ జరుగుతుందని తెలుస్తుంది. అయితే అల్లు అర్జున్ మాత్రం వెయ్యి కోట్ల బిజినెస్ జరిగేలా చూడాలని చూస్తున్నాడంట. దీనికోసం సుకుమార్ ని కాస్తా హై ఎండ్ లో మూవీకి సంబందించిన అప్డేట్స్ ని ప్రేక్షకులకి అందిస్తూ హైప్ క్రియేట్ చేయాలని బన్నీ సలహా ఇస్తున్నట్లు ఇండస్ట్రీ వర్గాల మాట.