ఇండస్ట్రీ టాక్ : “పుష్ప 2” ఫస్ట్ లుక్ ఆరోజునే.!

పాన్ ఇండియా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా ఇప్పుడు ఓ మాసివ్ పాన్ ఇండియా సినిమా పుష్ప ది రూల్ చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. కాగా ఈ సినిమా షూటింగ్ ఇప్పుడు శరవేగంగా తెరకెక్కుతూ ఉండగా దర్శకుడు సుకుమార్ ఓ రేంజ్ లో దీనిని తెరకెక్కిస్తున్నారు.

ఇక ఓటిటి అని ఓవర్సీస్ హక్కులు భారీ ఆఫర్స్ ఈ సినిమాకి వస్తుండగా ఈ సినిమాపై ఇప్పుడు బిగ్ బజ్ బయటకి వచ్చింది. ఈ ఏప్రిల్ నెలలోనే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బర్త్ డే ఉంటుంది అని తెలిసిందే. కాగా దీనికి ఆల్రెడీ చిత్ర యూనిట్ ఓ క్రేజీ వీడియో ట్రీట్ ని లాక్ చేయగా ఈ మాసివ్ వీడియో కాకుండా ఇప్పుడు మరో క్రేజీ ట్రీట్ రానున్నట్టుగా తెలుస్తుంది.

మరి అది ఈ సినిమాలో పుష్ప రాజ్ ఫస్ట్ లుక్ అన్నట్టుగా కన్ఫర్మ్ అయ్యింది. మరి దీనిని అయితే ఈ ఏప్రిల్ 7న రిలీజ్ చేయాలని లాక్ చేశారట. బన్నీ బర్త్ డే ఏప్రిల్ 8న కాగా 7న ఈ లుక్ పోస్టర్ ని మేకర్స్ రిలీజ్ చేయనున్నారు. దీనితో బన్నీ ఫ్యాన్స్ కి పాన్ ఇండియా లెవెల్లో ఆరోజు న మాత్రం గ్రాండ్ ట్రీట్ రాబోతుంది అని చెప్పాలి.

7న ఈ పోస్టర్ 8న అయితే 3 నిమిషాల ఇంట్రెస్టింగ్ వీడియో రానున్నాయని చెప్పొచ్చు. కాగా ఈ భారీ సినిమాని ఐతే ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ మరింత గ్రాండ్ గా సుకుమార్ ప్లాన్ చేస్తుండగా దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు అలాగే వచ్చే ఏడాదిలో ఈ సినిమా రిలీజ్ కానుంది.