లేటెస్ట్ : “పుష్ప 1” రష్యా భాషలో ఎలా ఉందో చూసారా..?

గత ఏడాది పాన్ ఇండియా సినిమాలో భారీ వసూళ్లతో దుమ్ము లేపిన చిత్రం పుష్ప కూడా ఒకటి. దర్శకుడు సుకుమార్ అలాగే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన చిత్రం “పుష్ప” కూడా ఒకటి. భారీ వసూళ్లతో దుమ్ము లేపిన ఏ చిత్రం తర్వాత కొన్నాళ్ల వరకు కూడా నేషనల్ వైడ్ కూడా అదరగొట్టింది.

ఇలా సెన్సేషనల్ రీచ్ తో కొనసాగిన ఈ చిత్రం గత కొన్నాళ్ల కితమే పుష్ప 1 ని రష్యా భాషలో అయితే రిలీజ్ చేస్తున్నట్టుగా అనౌన్స్ చేశారు. ఇక దీనితో నెక్స్ట్ దీనిపై కూడా మంచి అంచనాలు నెలకొనగా ఇప్పుడు డబ్బింగ్ పనులు అన్నీ కంప్లీట్ చేసి ఇప్పుడు ఈ చిత్రం రిలీజ్ కి రెడీ అయ్యిపోయింది.

మరి ఈ సినిమా అయితే ట్రైలర్ ని చిత్ర యూనిట్ రష్యన్ భాషలో రిలీజ్ చేశారు. మరి ఈ ట్రైలర్ కూడా సూపర్ గా ఉండగా కొంచెం కొన్ని కొత్త కట్స్ తో డిజైన్ చేశారు. అలాగే మన తెలుగు వారికి అయితే కాస్త కొత్తగా ఈ డైలాగ్స్ అవీ ఉండగా కొన్ని సీన్స్ అయితే మంచి స్ట్రాంగ్ గా అనిపిస్తున్నాయి.

అయితే ఈ చిత్రాన్ని ఈ డిసెంబర్ 8న చాలా గ్రాండ్ గా రిలీజ్ చేయబోతున్నారు. ఇక ఈ సినిమాలో అయితే రష్మికా మందన్నా హీరోయిన్ గా నటించగా సునీల్, ఫహద్ ఫాజిల్ లు విలన్ పాత్రల్లో నటించారు. అలాగే మైత్రి మేకర్స్ నిర్మాణం వహించిన ఈ చిత్రం రష్యా లో 4 సీజన్స్ క్రియేషన్స్ వారు రష్యా లో ఈ చిత్రం రిలీజ్ చేస్తున్నారు.