Puri Jagannath: మెగాస్టార్ సినిమాలో నటించనున్న ఆ డైరెక్టర్ ఎవరో తెలుసా..?

Puri Jagannath: ప్రస్తుతం దర్శకుడిగా పూరీ జగన్నాథ్ వరుస సినిమాలతో చాలా బిజీగా వున్నారు.లైగర్’ సినిమాను పూర్తి చేసిన ఆయన ‘JGM’ సినిమాను మొదలుపెట్టారు. ఇందులో కూడా విజయ్ దేవరకొండ హీరోగా కనిపించబోతున్నారు. పూరి చేతుల్లో ఎంత పెద్ద ప్రాజెక్ట్స్ ఉన్నప్పటికీ.. అయన గెస్ట్ రోల్ లో కనిపించడానికి రెడీ అవుతున్నారు. ఈ వీకెండ్ లో హైదరాబాద్ లో జరుగుతోన్న ‘గాడ్ ఫాదర్’ షూటింగ్ లో పూరి జాయిన్ కానున్నారు.

చిరుతో ఓ సినిమా తీయాల‌న్న‌ది పూరి క‌ల‌. `ఆటోవాలా` అనే స‌బ్జెక్ట్ ని రెడీ చేసినా అది ప‌ట్టాలెక్క‌లేదు. అయితే చిరుతో ప‌నిచేయాల‌న్న కోరిక మాత్రం పూరికి తీర‌బోతోంది. ద‌ర్శ‌కుడిగా కాదు. న‌టుడిగా. చిరుతో క‌లిసి పూరి ఓ సినిమాలో న‌టిస్తున్నారు.చిరంజీవి క‌థానాయ‌కుడిగా న‌టిస్తున్న చిత్రం గాడ్ ఫాద‌ర్‌. మోహ‌న్ రాజా ద‌ర్శ‌కుడు. మ‌ల‌య‌ళంలో సూప‌ర్ హిట్ అయిన `లూసీఫ‌ర్‌`సినిమాకి రీమేక్ గా ఈ చిత్రన్ని తీస్తున్నారు.ఈ సినిమాలో నయనతార, సత్యదేవ్ లాంటి తారలు కీలకపాత్రలు పోషిస్తున్నారు.అలానే బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ క్యామియో రోల్ పోషిస్తున్నారు.

ఇక పూరీ పాత్ర విషయానికి వస్తే, పూరీ జగన్నాథ్ ఈ సినిమాలో జ‌ర్న‌లిస్టుగా కనిపిస్తున్నారట.క‌థ‌లో చాలా కీల‌క‌మైన చోట‌.. పూరి ఎంట్రీ ఉండ‌బోతోంది. మ‌ల‌యాళంలో ఈ పాత్ర‌లేదు. తెలుగు మార్పులూ, చేర్పుల‌లో భాగంగా.. ఈ పాత్ర రాబోతోంది. పూరి ప‌లికే డైలాగులు గ‌మ్మ‌త్తుగా ఉంటాయని, ప‌వ‌ర్‌ఫుల్ గా వినిపిస్తాయని, పూరి క‌నిపించేది కాసేపే అయినా… ఆ సీన్ ర‌క్తి క‌ట్ట‌బోతోంద‌ని తెలుస్తోంది.